Mohan Babu: నాకు అవార్డు రాకుండా అడ్డుకున్నారు.. ఎంగిలి కూడుకు ఆశపడొద్దంటూ మోహన్ బాబు మాస్ వార్నింగ్
మోహన్ బాబు 573 కు పైగా సినిమాల్లో నటించారు. అలాగే 72 సినిమాలకు పైగా నిర్మించారు మోహన్ బాబు. సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలను గుర్తించిన అప్పటి కేంద్ర ప్రభుత్వం 2007లో పద్మశ్రీ తో ఆయనను సత్కరించింది. ఇదిలా ఉంటే మోహన్ బాబు తనకు అవార్డులు రాకుండా చాలా మంది అడ్డుపడుతున్నారని అన్నారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు.. టాలీవుడ్ లో ఆయనది సపరేట్ స్టైల్.. విలన్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోగా మారి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు మోహన్ బాబు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ తర్వాత అతలా డైలాగ్స్ చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మోహన్ బాబు. అందుకే ఆయనకు డైలాగ్ కింగ్ అనే బిరుదు వచ్చింది. మోహన్ బాబు ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు. మోహన్ బాబు 573 కు పైగా సినిమాల్లో నటించారు. అలాగే 72 సినిమాలకు పైగా నిర్మించారు మోహన్ బాబు. సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలను గుర్తించిన అప్పటి కేంద్ర ప్రభుత్వం 2007లో పద్మశ్రీ తో ఆయనను సత్కరించింది. ఇదిలా ఉంటే మోహన్ బాబు తనకు అవార్డులు రాకుండా చాలా మంది అడ్డుపడుతున్నారని అన్నారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
మోహన్ బాబు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అసెంబ్లీ రౌడీ, రాయలసీమ రామన్న చౌదరి, పెద్దరాయుడు, అల్లుడు గారు. శ్రీరాములయ్య, అడవిలో అన్న ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు మోహన్ బాబు. అయితే తన సినిమాలకు అవార్డులు రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని గతంలో మోహన్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడుతూ..
“చరిత్రలో నిలిచిపోయే సినిమాలు చాలా చేశాను కానీ ఒక్క సినిమాకు కూడా అవార్డు లేదంటే.. రాకుండా చేశారు. నేను అప్లై చేశాను. రాయలసీమ రామన్న చౌదరి, పెద్దరాయుడు ఎలాంటి సినిమాలు అవి. నాకు అవార్డు రాకుండా అడ్డుపడిన వ్యక్తులు తెలుసు. వాళ్లకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పా.. థాంక్యూ సార్ నాకు అవార్డు ఇవ్వకుండా ఓ చెత్త సినిమాకు ఇచ్చారు అని చెప్పా.. అది కాదు అని ఎదో చెప్పబోయాడు. డోంట్ టాక్ టు మీ .. ఇంకా ఎంగిలి కూడుకు ఆశపడుతున్నారు.. ఇంత వయసొచ్చింది.. మీరంతా కమిటీ సభ్యులు. ఎందుకు అటువంటి పనులు చేస్తారు అని చెప్పాను” అన్నారు మోహన్ బాబు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోహన్ బాబు డేర్ కు హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్స్.
మోహన్ బాబు ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..
Commending the government and CM Sri. @revanth_anumula for instituting state GADDAR awards, a testament to their commitment to cultural recognition. Special applause to my brother Sri. Gaddar, whose soul-stirring songs have become anthems of change. His songs serve as a catalyst… pic.twitter.com/jh5gQwPSqa
— Mohan Babu M (@themohanbabu) February 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.