AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Joruga Husharuga OTT: సైలెంట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన బేబీ హీరో కొత్త మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

బేబీ మూవీ ఫేమ్‌ విరాజ్‌ అశ్విన్‌, తెలుగమ్మాయి రంగ స్థలం ఫేమ్‌ పూజిత పొన్నాడ జంటగా నటించిన చిత్రం జోరుగా హుషారుగా. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ గతేడాది డిసెంబర్‌ 15న థియేటర్లలో విడుదలైంది. అయితే పెద్దగా ప్రమోషన్లు నిర్వహించకపోవడం, బరిలో పెద్ద సినిమాలు ఉండడంతో యావరేజ్‌ రిజల్ట్‌ తో సరిపెట్టుకుంది.

Joruga Husharuga OTT: సైలెంట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన బేబీ హీరో కొత్త మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?
Joruga Husharuga Movie
Basha Shek
|

Updated on: Feb 08, 2024 | 4:07 PM

Share

బేబీ మూవీ ఫేమ్‌ విరాజ్‌ అశ్విన్‌, తెలుగమ్మాయి రంగ స్థలం ఫేమ్‌ పూజిత పొన్నాడ జంటగా నటించిన చిత్రం జోరుగా హుషారుగా. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ గతేడాది డిసెంబర్‌ 15న థియేటర్లలో విడుదలైంది. అయితే పెద్దగా ప్రమోషన్లు నిర్వహించకపోవడం, బరిలో పెద్ద సినిమాలు ఉండడంతో యావరేజ్‌ రిజల్ట్‌ తో సరిపెట్టుకుంది. ఇప్పుడీ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే జోరుగా హుషారుగా మూవీ స్ట్రీమింగ్‌ కు రావడం గమనార్హం. ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో గురువారం (ఫిబ్రవరి 08) అర్ధరాత్రి నుంచే విరాజ్‌, పూజితల సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్త దర్శకుడు అనుప్రసాద్‌ తెరకెక్కించిన ఈ మూవీలో సాయి కుమార్‌, రోహిణీ, మధునందన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

జోరుగా హుషారుగా క‌థ ఇదే…

ఇక సినిమా కథ విషయానికి వస్తే..సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ లో చేరిన సంతోష్ త‌న జీతం పెంచుకోవ‌డానికి ర‌క‌ర‌కాల ప్రయత్నాలు చేస్తాడు. అదే కంపెనీలో సంతోష్ ప్రియురాలు నిత్య (పూజిత పొన్నాడ‌) కూడా ఉద్యోగం చేస్తుంటుంది. అయితే నిత్య‌తో త‌న ప్రేమాయ‌ణాన్ని ఆఫీస్ వాళ్లకు తెలియకుండా రహస్యంగా మెయింటైన్‌ చేస్తాడు సంతోష్‌. మరి అత‌ను అలా ఎందుకు చేశాడు? ప్రేమ‌తో పాటు పర్సనల్‌ లైఫ్ లో ఎదురైన క‌ష్టాల నుంచి సంతోష్ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? అప్పుల‌ను ఎలా తీర్చ‌గ‌లిగాడా న్న‌దే జోరుగా హుషారుగా మూవీ క‌థ‌. వీకెండ్‌ లో రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌ చూడాలనుకునేవారు ఈ మూవీపై ఒక లుక్‌ వేయవచ్చు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..

జోరుగా హుషారుగా సినిమాలో పూజిత పొన్నాడ..

హీరో విరాజ్, సాయి కుమార్ లతో పూజిత..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై