AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : లేడీ ప్రొడ్యూసర్ నిర్వాకం.. వలపు వల, పెళ్లి.. కట్ చేస్తే.. ఊహించని ట్విస్ట్

తాజాగా ఓ టాలీవుడ్ మహిళా నిర్మాత ఓ వ్యక్తిని పెళ్లి చేసుకొని అందినంత దోచుకొని దారుణంగా మోసం చేసింది. దాంతో మోసపోయిన ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించి జరిగిందంతా చెప్పి న్యాయం చేయమని మొరపెట్టుకున్నాడు. ఇంతకూ ఆ కి లేడీ ఏం చేసింది.? ఎలా మోసం చేసిందో ఇప్పుడు చూద్దాం.! 

Tollywood : లేడీ ప్రొడ్యూసర్ నిర్వాకం.. వలపు వల, పెళ్లి.. కట్ చేస్తే.. ఊహించని ట్విస్ట్
Tollywood
Rajeev Rayala
|

Updated on: Feb 08, 2024 | 3:40 PM

Share

పెళ్లి అయినా కూడా పెళ్లి కాలేదు అని మోసం చేసే మగవారి గురించి చాలా విన్నాం.. కొన్ని సార్లు మహిళలు కూడా పెళ్లి పేరుతో మగాళ్లను మోసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ టాలీవుడ్ మహిళా నిర్మాత ఓ వ్యక్తిని పెళ్లి చేసుకొని అందినంత దోచుకొని దారుణంగా మోసం చేసింది. దాంతో మోసపోయిన ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించి జరిగిందంతా చెప్పి న్యాయం చేయమని మొరపెట్టుకున్నాడు. ఇంతకూ ఆ కి లేడీ ఏం చేసింది.? ఎలా మోసం చేసిందో ఇప్పుడు చూద్దాం.!

వెంకటగిరి ప్రాంతానికి చెందిన పుల్లంశెట్టి నాగార్జున బాబు అనే వ్యక్తి కెమెరా అసిస్టెంట్ గా పని చేస్తూ ఉండేవాడు. అదే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓ మహిళా అతడి పై కన్నేసింది. ఓ రోజు అతడిని డిన్నర్ కు ఇంటికి పిలిచింది. అదే సమయంలో తాను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నా అని తెలిపింది. ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా అని తెలిపింది. ఇదే క్రమంలో మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని అతడిని ఒప్పించింది. అతను కూడా అందుకు ఒప్పుకున్నాడు. దాంతో ఈ ఇద్దరూ హైదరాబాద్ లోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆతర్వాత అసలు కథ మొదలైంది.

నాగార్జున బాబు దగ్గర నుంచి ఆ మహిళా నిర్మాత డబ్బు గుంజడం మొదలు పెట్టింది. అతని దగ్గర నుంచి నేరుగా.. 18,50,000 డబ్బు తీసుకుంది మరో పదిలక్షలు అకౌంట్ లో వేయించుకుంది. ఆమె తీరు పై అనుమానం రావడంతో నాగార్జున బాబు ఆరా తీశారు. దాంతో అసలు విషయం బయట పడింది.. ఆమెకు అంతకు ముందే మూడు పెళ్లిళ్లు అయ్యాయని తెలిసింది. అంతే కాదు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. దాంతో పోలీసులను ఆశ్రయించాడు నాగార్జున బాబు. పోలీసులు విచారించగా.. ఆమె వైజాగ్‌ గాజువాక పోలీస్‌ స్టేషన్‌లో భరత్‌ అనే వ్యక్తిపై, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో శ్రీనివాస్‌ అనే వ్యక్తిపై, నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కార్తికేయ అనే వ్యక్తులపై కేసులు నమోదు చేసింది. ఇప్పుడు ఆమె పై నాగార్జున బాబు పోలీసు కేసు పెట్టాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్