AP DSC 2024 Notification: నేటి నుంచి ఏపీ డీఎస్సీ 2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాధారణ ఎన్నికల ముందు ఏపీ డీఎస్సీ-2024 షెడ్యూలును మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల ప్రకటించారు కూడా. మొత్తం 6,100 పోస్టులను డీఎస్సీ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నామని, ఉపాధ్యాయ నియామకాలతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారం..

AP DSC 2024 Notification: నేటి నుంచి ఏపీ డీఎస్సీ 2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే
AP DSC 2024 Notification
Follow us

|

Updated on: Feb 12, 2024 | 3:03 PM

అమరావతి, ఫిబ్రవరి 12: గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాధారణ ఎన్నికల ముందు ఏపీ డీఎస్సీ-2024 షెడ్యూలును మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల ప్రకటించారు కూడా. మొత్తం 6,100 పోస్టులను డీఎస్సీ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నామని, ఉపాధ్యాయ నియామకాలతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారం ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ ఈ రోజు (ఫిబ్రవరి 12) విడుదలకానుంది. దరఖాస్తుల స్వీకరణ కూడా ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది. ఏప్రిల్‌ 31 వరకు రాబోయే ఖాళీలనూ పరిగణనలోకి తీసుకొని, ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. దరఖాస్తు స్వీకరణ ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు ఉంటుంది. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు. డీఎస్సీలో ఎంపికైన వారికి జూన్‌ 8న పోస్టింగులు ఇస్తామని మంత్రి బొత్స విడుదల చేసిన షెడ్యూల్‌లో వెల్లడించారు. నిరుద్యోగులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లుగా నిర్ణయించారు. ఇవ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా ఐదేళ్ల సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 54 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంటుంది.

కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష, డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏపీతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, బరంపూర్‌లో అదనంగా పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఆయా తేదీల్లో రోజుకు రెండు విడతల చొప్పున ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి విడత పరీక్ష ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో విడత పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

డీఎస్సీ షెడ్యూల్‌ ఇలా..

  • నోటిఫికేషన్‌ విడుదల తేదీ: ఫిబ్రవరి 12, 2024.
  • దరఖాస్తులు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 22 వరకు
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు రుసుము చెల్లింపుకు తుది గడువు: ఫిబ్రవరి 12 నుంచి 21 వరకు
  • ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ తేదీలు: ఫిబ్రవరి 24, 2024.
  • హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ తేదీ: మార్చి 5 నుంచి
  • ఆన్‌లైన్‌ రాత పరీక్ష తేదీలు: మార్చి 15 నుంచి 30 వరకు
  • ఫలితాలు విడుదల తేదీ: ఏప్రిల్ 7, 2024.

మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్