Narayana Murthy: ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను.! బాధపడిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.

Narayana Murthy: ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను.! బాధపడిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.

Anil kumar poka

|

Updated on: Feb 13, 2024 | 4:58 PM

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి 'యాన్ అన్‌కామన్ లవ్: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి' బుక్ ను బెంగళూరులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్థలో చాలా మంది ఉద్యోగులకు తగినన్ని రివార్డ్‌లు ఇవ్వలేకపోతున్నందుకు విచారంగా ఉందని అన్నారు. సంస్థ ఉన్నతికి ఉద్యోగుల సహకారం ప్రధానమని తెలిపారు. ఇన్ఫోసిస్‌ సంస్థ ఉన్నతికి ఉద్యోగులు చాలా కష్టపడుతున్నారని,

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ‘యాన్ అన్‌కామన్ లవ్: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి’ బుక్ ను బెంగళూరులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్థలో చాలా మంది ఉద్యోగులకు తగినన్ని రివార్డ్‌లు ఇవ్వలేకపోతున్నందుకు విచారంగా ఉందని అన్నారు. సంస్థ ఉన్నతికి ఉద్యోగుల సహకారం ప్రధానమని తెలిపారు. ఇన్ఫోసిస్‌ సంస్థ ఉన్నతికి ఉద్యోగులు చాలా కష్టపడుతున్నారని, వీరికి కంపెనీ కో-ఫౌండర్లకు ఇచ్చినంత స్టాక్‌ను ఇవ్వలేకపోయానని చింతించారు. ఉద్యోగులు కూడా సంస్థ వల్ల ప్రయోజనాలను పొందాలని తాను కోరుకుంటున్నట్లు నారాయణ మూర్తి చెప్పారు. నారాయణ మూర్తి టాయిలెట్లను శుభ్రం చేయడం గురించి, ఎందుకు శుభ్రం చేయాలనే విషయాలను వెల్లడిస్తూ.. తన పిల్లలకు కూడా టాయిలెట్లను తామే శుభ్రం చేసుకోవాలని, సమాజంలో ఎవరూ తక్కువ కాదని చెప్పినట్లు తెలిపారు. చాలామంది ధనవంతుల పిల్లలు ఇప్పటికి కూడా టాయిలెట్లను శుభ్రం చేయడం మన పనికాదని భావిస్తారని అది కరెక్ట్ కాదని అన్నారు. 1981లో పూణేలో ప్రారంభమైన ఇన్ఫోసిస్ ప్రధాన కార్యాలయం ఇప్పుడు బెంగళూరులో ఉంది. సంస్థ ప్రారంభంలో తాను వారానికి 85 నుంచి 90 గంటలు పనిచేశానని చెప్పారు నారాయణమూర్తి. ఇప్పటి యువత వారానికి అధిక పని గంటలు వెచ్చించాలని ఆయన చేసిన కామెంట్లు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..