AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine’s Day Tragedy: ప్రేమికుల రోజున ప్రేమ జంట సూసైడ్‌! కన్నోళ్లు తమ ప్రేమను అంగీకరించలేదనీ..

ఓ ప్రేమ జంట దారుణ నిర్ణయం తీసుకుంది. యావత్ ప్రపంచం ప్రేమికుల రోజున సంబరాలు జరుపుకుంటుంటే ఈ ప్రేమ జంట మాత్రం నిండు జీవితానికి చరమగీతం పాడారు. తమ ప్రేమకు ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించ లేదనీ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో బుధవారం (ఫిబ్రవరి 14) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Valentine's Day Tragedy: ప్రేమికుల రోజున ప్రేమ జంట సూసైడ్‌! కన్నోళ్లు తమ ప్రేమను అంగీకరించలేదనీ..
Lovers Die By Suicide in UP
Srilakshmi C
|

Updated on: Feb 14, 2024 | 5:41 PM

Share

మహోబా, ఫిబ్రవరి 14: ఓ ప్రేమ జంట దారుణ నిర్ణయం తీసుకుంది. యావత్ ప్రపంచం ప్రేమికుల రోజున సంబరాలు జరుపుకుంటుంటే ఈ ప్రేమ జంట మాత్రం నిండు జీవితానికి చరమగీతం పాడారు. తమ ప్రేమకు ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించ లేదనీ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో బుధవారం (ఫిబ్రవరి 14) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాకు చెందిన చర్ఖారీ మండలంలోని కనెలా గ్రామానికి చెందిన సురీందర్ సింగ్ (20), పొరుగు గ్రామానికి చెందిన యువతి సీమ (19) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఒకరినొకరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం ఇటీవల రెండు కుటుంబాలకు తెలిసింది. దీంతో వారిని తీవ్రంగా తిట్టి, ఇకపై ఒకరినొకరు కలుసుకోవడం, మాట్లాడుకోవడం కుదరదంటూ హెచ్చరించారు. ఈక్రమంలో తీవ్ర మనస్తాపం చెందిన సురీందర్ బుధవారం (ఫిబ్రవరి 14) ఉదయం 6 గంటల ప్రాంతంలో తాను పొలానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. సురీందర్ గ్రామం వెలుపల ఉన్న వంతెన వద్దకు చేరుకుని విషం సేవించాడు. అనంతరం తాను విషం తాగానని సీమకు ఫోన్‌లో సమాచారం అందించాడు. దీంతో సీమ కూడా తన ఇంట్లో విషం సేవించింది.

ఇవి కూడా చదవండి

ఒకే ఆసుపత్రిలో ప్రాణాలొదిలిన ప్రేమ జంట

వంతెన వద్ద అపస్మారక స్థితిలో పడిఉన్న సురీందర్ సింగ్‌ను గమనించిన గ్రామస్థులు హుటాహుటీన మహోబా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం సురీందర్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సురీందర్ విషం సేవించిన విషయాన్ని అతని కుటుంబ సభ్యులు సీమ కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. తమ కుమార్తె కూడా విషం సేవించిందని వారు తెలిపారు. ఇంట్లో కడుపు నొప్పితో విలవిల లాడుతున్న సీమను గమనించిన కుటుంబ సభ్యులు కారణాన్ని అడగ్గా విషం సేవించినట్లు తెలిపింది. దీంతో ఆమెను కూడా మహోబా జిల్లా ఆసుపత్రికి తరలించారు. తమ ఇంట్లో పది సల్ఫర్‌ ట్యాబెల్ట్స్‌లలో ఐదింటిని సీమ మింగి ఉంటుందని ఆమె తండ్రి పేర్కొన్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురీందర్‌, సీమా ఇద్దరూ బుధవారం మరణించారు.

ఈ రోజు ఉదయం 7 గంటలకు సురీందర్ ఆసుపత్రిలో మరణించగా.. మరికొద్ది సేపటికి సీమ కూడా మృతి చెందింది. బుధవారం ప్రేమికుల రోజు కావడంతో ప్రేమ జంట ప్రాణాలు వదలడం తీవ్రంగా కలచివేసింది. దీంతో రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. ప్రేమ జంట మృతిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.