ప్రాక్టిస్ అవ్వగానే బాత్రూమ్‌కు వెళ్లిన క్రీడాకారిణి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..

ఆమె ఓ టెన్నిస్ యువ క్రీడాకారిణి.. కొన్ని రోజుల్లో మెయిన్ మ్యాచ్ ఉంది.. ఈ క్రమంలో ఇంట్లోనే ఉంటూ ప్రాక్టిస్ చేస్తోంది. రోజూలానే.. ప్రాక్టిస్ సెషన్‌లో పాల్గొంది.. ఆ తర్వాత బాత్రూమ్ కు వెళ్లింది.. తీరా ఎంతకూ బయటకు రాలేదు.. దీంతో ఏంటోనని కుటుంబసభ్యులు చూడగా.. ఆమె బాత్రూంలో స్పృహతప్పి పడిపోయి ఉంది. వెంటనే కుటుంబసభ్యులు

ప్రాక్టిస్ అవ్వగానే బాత్రూమ్‌కు వెళ్లిన క్రీడాకారిణి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..
Zainab Ali Naqvi
Follow us

|

Updated on: Feb 15, 2024 | 5:02 PM

ఆమె ఓ టెన్నిస్ యువ క్రీడాకారిణి.. కొన్ని రోజుల్లో మెయిన్ మ్యాచ్ ఉంది.. ఈ క్రమంలో ఇంట్లోనే ఉంటూ ప్రాక్టిస్ చేస్తోంది. రోజూలానే.. ప్రాక్టిస్ సెషన్‌లో పాల్గొంది.. ఆ తర్వాత బాత్రూమ్ కు వెళ్లింది.. తీరా ఎంతకూ బయటకు రాలేదు.. దీంతో ఏంటోనని కుటుంబసభ్యులు చూడగా.. ఆమె బాత్రూంలో స్పృహతప్పి పడిపోయి ఉంది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే.. ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతితో యువక్రీడాకారిణి మరణించిన షాకింగ్ ఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది. 17 ఏళ్ల పాకిస్తానీ టెన్నిస్ క్రీడాకారిణి హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి కారణంగా అనుమానాస్పద గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. వివరాల ప్రకారం.. టీనేజ్ పాకిస్థాన్ టెన్నిస్ క్రీడాకారిణి జైనబ్ అలీ నఖ్వీ తన మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్ తర్వాత బాత్రూంలో కుప్పకూలడంతో అనుమానాస్పద గుండెపోటుతో మరణించినట్లు వార్తా నివేదికలు తెలిపాయి. ప్రాక్టిస్ తర్వాత యువతి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో తన అమ్మమ్మ ఆమెను ఆసుపత్రికి తీసుకెళుతుండగా చనిపోయిందని పోలీసులు తెలిపారు. నివేదికల ప్రకారం, జైనాబ్‌కు హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి ఉందని వైద్యులు భావిస్తున్నారు. ఈ వ్యాధి ఏంటంటే.. గుండె కండరం మందంగా మారుతుంది. దీంతో మందమైన కండరాలు గుండెకు రక్తాన్ని పంప్ చేయడం కష్టతరం చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితి తరచుగా నిర్ధారణ చేయలేమని.. ఎందుకంటే వ్యాధి ఉన్న చాలా మందికి ఏవైనా లక్షణాలు ఉంటే చాలా తక్కువగా కనిపిస్తాయని వైద్యనిపుణులు తెలిపారు.

ఈ ఘటనపై స్పందించిన వైద్యులు గుండెపోటుగా అనుమానిస్తున్నారు.. కానీ.. ఇది సహజ మరణంగా పేర్కొన్న ఆమె తల్లిదండ్రులు పోస్ట్‌మార్టం వద్దని చెప్పారని.. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని తిరిగి కరాచీకి తీసుకెళ్లినట్లు ఒక వైద్యుడు అక్కడి మీడియాతో తెలిపారు.

హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?..

హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి అనేది గుండె కండరాలు లేదా మయోకార్డియం మందంగా కాకుండా ఎడమ జఠరికలో దృఢత్వం, మిట్రల్ వాల్వ్‌లో మార్పులు, సెల్యులార్ మార్పులకు కారణమయ్యే సంక్లిష్ట గుండె జబ్బు అని వైద్యులు చెబుతున్నారు. ఈ మార్పులు ఎక్కువగా సెప్టమ్‌లో ఉంటాయి. మీ గుండె ఎడమ, కుడి వైపులా వేరు చేసే కండరాల గోడ ప్రభావితం చేస్తుంది. అధ్యయనాల ప్రకారం, మీ గుండె దిగువ గదుల మధ్య ఉన్న సెప్టం కూడా చిక్కగా ఉన్నప్పుడు, ఎడమ జఠరిక నుండి గుండెకు రక్త ప్రవాహాన్ని నిరోధించడం, తగ్గించడం వంటి సమస్యలు సంభవిస్తాయి.

జఠరికలు అడ్డంకిని అధిగమించడానికి గట్టిగా పంప్ చేస్తాయి, ఇది హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతికి దారి తీస్తుంది. ఈ పరిస్థితి మీ గుండె కండరాలలోని ఇతర భాగాలను దిగువ, కుడి జఠరిక లేదా మీ మొత్తం ఎడమ జఠరికలో ఉన్న ప్రాంతాన్ని గట్టిపరుస్తుంది. చివరిలో రక్తం తక్కువగా ఉన్నందున, ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తం మీ అవయవాలకు, కండరాలకు పంప్ అవ్వదు.. ఇది మీ గుండె లోపల ఒత్తిడిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు.

ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి..

  • ఆకస్మిక ఛాతీ నొప్పి
  • ఊపిరి ఆడకపోవడం
  • మైకము లేదా మూర్ఛ
  • దడపుట్టడం, వణకడం

గుండె కండరాల కణాలు వ్యవస్థీకృతంగా, సమాంతరంగా కాకుండా అస్తవ్యస్తంగా, క్రమరహితంగా కనిపించినప్పటికీ, ఇది మీ గుండె దిగువ గదుల గుండా ప్రయాణించే సంకేతాలలో మార్పులకు దారితీయవచ్చు. వెంట్రిక్యులర్ అరిథ్మియా అని పిలువబడే అసాధారణ గుండె లయకు దారితీయవచ్చు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. ప్రతి 500 మందిలో ఒకరికి ఈ గుండె పరిస్థితి ఉంది. అయితే ఎక్కువ శాతం మంది రోగులకు రోగనిర్ధారణ కాలేదు..

హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతికి కారణమేమిటి?..

హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతికి అనేక సంభావ్య కారణాలు ఉన్నాయి.

జన్యుశాస్త్రం పరంగా: వంశపారపర్యంగా (మీరు మీ తల్లిదండ్రుల) హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిని పొందవచ్చని, మీ పిల్లలకు అది సంక్రమించవచ్చని వైద్యులు అంటున్నారు. గుండె కండరాల లక్షణాలను కోడ్ చేసే జన్యువులో కొంత లోపం ఉందని ఇది చూపిస్తుంది. అయితే, కుటుంబంలో హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి జన్యువులను కలిగి ఉన్న కొందరు వ్యక్తులు ఈ వ్యాధిని ఎప్పటికీ అభివృద్ధి చేయకపోవచ్చు.

అధిక రక్త పోటు: రక్తపోటులో ఆకస్మిక పెరుగుదల కూడా పరిస్థితికి కారణం కావచ్చు.

వృద్ధాప్యం: వృద్ధాప్యం, వయస్సు మీద పడినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి