AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మ‌హిళ క్రికెట‌ర్ల‌తో కోచ్ అస‌భ్య‌ ప్ర‌వ‌ర్త‌న‌… వేటు వేసిన HCA

హైదరాబాద్‌ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్‌ జై సింహా అసభ్య ప్రవర్తన కారణంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తమ పట్ల అనుచితంగా ప్రవర్తించిన జై సింహా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు మహిళా క్రికెటర్లు కంప్లైంట్ చేశారు. తమను జట్టు నుంచి తప్పిస్తామని కోచ్‌ బెదిరింపులకు గురిచేస్తున్నాడంటు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad: మ‌హిళ క్రికెట‌ర్ల‌తో కోచ్ అస‌భ్య‌ ప్ర‌వ‌ర్త‌న‌… వేటు వేసిన HCA
Coach Jaisimha
Ram Naramaneni
|

Updated on: Feb 16, 2024 | 11:22 AM

Share

ఫిబ్రవరి 16: హైదరాబాద్‌లో మహిళా క్రికెటర్ల పట్ల కోచ్‌ అసభ్య ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  టీమ్ అంతా బస్సులో వెళ్తున్న టైమ్‌లో మద్యం తాగుతూ కోచ్‌ జైసింహ అసభ్యంగా మాట్లాడారు అనేది క్రికెటర్ల ఆరోపణ. దీనిపై మహిళా క్రికెటర్లు అంతా హెచ్‌సీఏకు ఫిర్యాదు చేశారు. హెడ్ కోచ్‌ జైసింహతోపాటు ఆయన్ను సపోర్ట్ చేసిన సెలక్షన్‌ కమిటీ మెంబర్‌ పూర్ణిమారావుపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

మ్యాచ్‌ ఆడే నిమిత్తం మహిళల జట్టు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లింది. రిటన్ జర్నీలో విమానంలో రావాల్సి ఉండగా.. కోచ్‌ జై సింహా ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసినట్లు మహిళా క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. ఫ్లైట్‌ మిస్‌ అవడంతో టీమ్‌తో సహా బస్‌లో హైదరాబాద్‌కు బయల్దేరిన జైసింహ.. మద్యం తాగుతూ మహిళా క్రికెటర్లను బూతులు తిట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

మహిళా క్రికెట్‌కు హెడ్‌ కోచ్‌గా ఉన్న విద్యుత్‌ జైసింహ ఎప్పుడూ మద్యం మత్తులో ఉంటారని, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారంతా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలతో అమ్మాయిలకు భద్రతపైనా తమలో ఆందోళన నెలకొందని పేరెంట్స్ అంటున్నారు. జైసింహ ప్రవర్తనను ఎవరైనా తప్పుపడితే పోలీస్ ఆఫీసర్ల పేర్లో, మాజీ రంజీ ప్లేయర్ల పేర్లో చెప్పి బెదిరిస్తున్నారని కూడా HCAకి ఇచ్చిన కంప్లైంట్లో పేర్కొన్నారు.

HCAకి మహిళా క్రికెటర్ల భద్రతపై ఏమాత్రం బాధ్యత ఉన్నా తక్షణం.. జైసింహపైన, పూర్ణిమారావుపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. తక్షణం వారిని బ్యాన్ చేయాలని కోరుతున్నారు. ఘటనపై HCA తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హెడ్ కోచ్‌ జైసింహను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..