Telangana Assembly: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. వాస్తవాలను ప్రజల ముందు ఉంచామన్న భట్టి విక్రమార్క..
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై వాడివేడిగా చర్చ జరిగింది. ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో నిధుల్లేవని అపొజిషన్ అంటే.. అంకెల గారడీ కాకుండా వాస్తవిక బడ్జెట్‌నే ప్రజల ముందు ఉంచామన్నది అధికార పక్షం.. ప్రతిపక్షం కాదు.. బీఆర్ఎస్‌ది ఫ్రస్టేషన్ పక్షమంటూ.. సభలో నవ్వులు పూయించారు మంత్రి కోమటిరెడ్డి.. ఇలా తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై గురువారం కీలక చర్చ జరిగింది.
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై వాడివేడిగా చర్చ జరిగింది. ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో నిధుల్లేవని అపొజిషన్ అంటే.. అంకెల గారడీ కాకుండా వాస్తవిక బడ్జెట్‌నే ప్రజల ముందు ఉంచామన్నది అధికార పక్షం.. ప్రతిపక్షం కాదు.. బీఆర్ఎస్‌ది ఫ్రస్టేషన్ పక్షమంటూ.. సభలో నవ్వులు పూయించారు మంత్రి కోమటిరెడ్డి.. ఇలా తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై గురువారం కీలక చర్చ జరిగింది. పదేళ్లపాటు బడ్జెట్ పెంచుకుంటూ పోయారే తప్ప.. వాస్తవాలను ప్రజల ముందు ఉంచలేదన్నారు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క. ఇచ్చిన హామీలు వచ్చే ఆదాయానికి సరిపోయేలా ఉండాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. 2014 నుంచి 2023 దాకా బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులో చాలా వ్యత్యాసం ఉందన్నారు భట్టి. ఈ సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర అబ్జెక్షన్ చెప్పింది. బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్న ప్రభుత్వ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో.. ఆర్థిక విధ్వంసం కాదు అనేక రంగాల్లో అభివృద్ధి జరగిందన్నారు.
తాము నోటిఫికేషన్లు ఇచ్చి.. ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన వాటికి నియామక పత్రాలిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం క్రెడిట్ కొట్టేస్తుందని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అయితే.. మీ నిర్లక్ష్యంతో ఆగిన నియామకాలు తాము ఫిల్ చేస్తున్నామంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇటీవలే TSPSC బోర్డ్ ఏర్పాటైందని, త్వరలోనే నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన అంశాలకు బడ్జెట్‌లో సరిపడా నిధులు కేటాయించలేదన్న కడియం శ్రీహరి విమర్శలపై స్పందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ ప్రతిపక్షం కాదు.. ఫ్రస్టేషన్ పక్షమన్నారు.
వీడియో చూడండి..
గత బడ్జెట్‌కు ఈ బడ్జెట్‌కు చాలా దగ్గర పోలిక ఉందన్నారు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలకు బడ్జెట్‌లో సరైన కేటాయింపులు లేవన్నారు.
అసెంబ్లీకి మొదటిసారి వచ్చిన ఎమ్మెల్యేలు.. జీరో అవర్‌లో తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సభలో చెప్పారు. ప్రభుత్వం నిధులు ఇవ్వాలని కోరారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఆలస్యం కావడంతో.. అసెంబ్లీలో కులగణన తీర్మానం రేపటికి వాయిదా వేశారు. రేపు ఉదయం 10 గంటలకు తీర్మానం పెట్టనున్నారు మంత్రి పొన్నం.
ఇదిలాఉంటే.. రేవంత్ ప్రభుత్వం శుక్రవారం ఇరిగేషన్‌శాఖపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనుంది. శ్వేత పత్రం విడుదల తరువాత.. కీలక చర్చ జరగనుంది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..