Congress Joining: హస్తం గూటికి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్

లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇన్నాళ్ళ పార్టీ జాయింనింగ్స్‌పై మౌనంగా కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్‌లో కీలక నేతల చేరికలతో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయనే అంశం ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Congress Joining: హస్తం గూటికి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్
Congress Joinings
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 16, 2024 | 4:11 PM

లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇన్నాళ్ళ పార్టీ జాయింనింగ్స్‌పై మౌనంగా కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్‌లో కీలక నేతల చేరికలతో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయనే అంశం ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీకాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ హస్తం గూటికి చేరారు.

చేవేళ్ల లోక్‌సభ సీటుపై హామీతోనే పట్నం సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారనే వార్తలు వినిపిస్తున్నాయి. చేవేళ్ల నుంచి బీజేపీ, బీఆర్ఎస్ తరపున బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో.. కాంగ్రెస్ కూడా నియోజకవర్గంపై పట్టున్న పట్నం ఫ్యామిలీని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు దఫాలు చర్చలు జరిపిన పట్నం కుటుంబసభ్యులు ఎట్టకేలకు ఎంపీ సీటు కోసం లైన్ క్లియర్ కావడంతో సునీతా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కాంగ్రెస్ ఏ విధమైన హామీ ఇచ్చిందనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. బొంతు రామ్మోహన్ సికింద్రాబాద్ లేదా మల్కాజ్‌గిరి లోక్ సభ సీటు ఆశిస్తున్నట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎంపీ సీటుపై ఏ విధమైన హామీ ఇచ్చిందన్నదీ ఆసక్తికరంగా మారింది. అయితే టీకాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు రామ్మోహన్.

కాంగ్రెస్‌లో చేరిన మరో నేత కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి సైతం మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ స్వయాన మామ అయిన చంద్రశేఖర్‌ రెడ్డి, గతంలో బీఆర్‌ఎస్ తరపున పోటీ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ఆయనకు బీఆర్‌ఎస్ తరపున పోటీ చేసే అవకాశం రాలేదు. తాజాగా ఆయన కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆయనకు సీటు విషయంలో హస్తం పార్టీ ఏ రకమైన హామీ ఇచ్చిందనే అంశంపై చర్చ జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…