INTER BOARD: ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం.. ప్రభుత్వం మారినా మారని ప్రశ్నాపత్రాలు..!

రాష్ట్రంలో విద్యాశాఖ అధికారుల తీరు మారడం లేదు. ఇంటర్ బోర్డులో పరీక్షల నిర్వహణంలో ఏటా తప్పులు పరిపాటిగా మారింది. ఈ ఏడాది వార్షిక పరీక్షలకు ముందే ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌లోనే అధికారుల అలసత్వం బయటపడింది. ఇంటర్ విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షల్లో శుక్రవారం ఇంగ్లీష్ ఎగ్జామ్ పెట్టారు.

INTER BOARD: ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం.. ప్రభుత్వం మారినా మారని ప్రశ్నాపత్రాలు..!
Negligence Of Inter Board
Follow us
Vidyasagar Gunti

| Edited By: Balaraju Goud

Updated on: Feb 16, 2024 | 3:20 PM

రాష్ట్రంలో విద్యాశాఖ అధికారుల తీరు మారడం లేదు. ఇంటర్ బోర్డులో పరీక్షల నిర్వహణంలో ఏటా తప్పులు పరిపాటిగా మారింది. ఈ ఏడాది వార్షిక పరీక్షలకు ముందే ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌లోనే అధికారుల అలసత్వం బయటపడింది. ఇంటర్ విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షల్లో శుక్రవారం ఇంగ్లీష్ ఎగ్జామ్ పెట్టారు. దీంట్లో విద్యార్థులు చదివి వినిపించాల్సిన పారాగ్రాప్ లో ప్రభుత్వం మారిందన్న విషయం కూడా మర్చిపోయి పాత డేటాతోనే ఎగ్జామ్ పెట్టారు. దాంట్లో ఆర్థిక మంత్రిగా హరీశ్ రావు ఉన్నట్లుగానే యథావిథిగా క్వశ్చన్ ను అడిగారు. ప్రభుత్వం మారిన కనీసం ప్రస్తుతం ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఛేంజ్ అయ్యే ప్రశ్నను తొలగించాలన్న ఆలోచన ఇంటర్ బోర్డు అధికారులకు లేదని పలువురు విమర్శిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రశ్నకు సంబంధించి 20 పారాగ్రాప్ లలో ఏదో ఒకటి ఇచ్చి దాన్ని చదవాలని విద్యార్థులకు పరీక్షలో ఇస్తారు. ఇందులో క్వశ్చన్ బ్యాంక్ లో ఉన్న ప్రశ్నను యథాతథంగా ఇవ్వడంతో పలు చోట్ల ఈ పారాగ్రాప్ చదవాల్సి వచ్చింది. దీంతో విద్యార్థులు ఆర్థికమంత్రి హరీశ్ రావు అంటూ ప్రాక్టికల్ ఎగ్జామ్ ముగించారు. దీనిపై ఇంటర్ లెక్చరర్స్ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా ఇలాంటి ప్రశ్నలను కొనసాగించడం పూర్తిగా నిర్లక్ష్యమేనంటూ మండిపడ్డారు. కారకులైన అధికారులపై చర్యలుతీసుకోవాలని డిమాండ్ చేసాశారు. రానున్న రోజుల్లో జరిగే ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షలను పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…