TS GENCO AE Revised Exam Date: జెన్‌కో ఏఈ, కెమిస్ట్ రాత పరీక్ష కొత్త తేదీ వెల్లడి.. మార్చి 23న హాల్‌టికెట్ల విడుదల
తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(జెన్‌కో)లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన రాత పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. మార్చి 31వ తేదీన ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మూడు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9.00 గంటల నుంచి 10.40 (మెకానికల్/ కెమిస్ట్) వరకు..

హైదరాబాద్, ఫిబ్రవరి 16: తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(జెన్‌కో)లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన రాత పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. మార్చి 31వ తేదీన ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మూడు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9.00 గంటల నుంచి 10.40 (మెకానికల్/ కెమిస్ట్) వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 1 గంట నుంచి 2.40 గంటల వరకు (ఎలక్ట్రికల్), మూడో షిఫ్ట్ సాయంత్రం 5 గంటల నుంచి 6.40 గంటల వరకు (సివిల్/ ఎలక్ట్రానిక్స్) జరుగుతుంది.
కాగా ఈ నోటిఫికేషన్ కింద తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలో మొత్తం 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, 60 కెమిస్ట్ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీకి సంస్థ యాజమాన్యం ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాలతోపాటు రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణకు అవసరమైన పోస్టులను భర్తీ చేస్తున్నట్టు సంస్థ తెలిపింది.
ఐబీపీఎస్ ఎస్‌వో మెయిన్స్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XIII) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవల మెయిన్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) తాజాగా విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా జనవరి 28వ తేదీన దేశ వ్యాప్తంగా ఉన్న పలు పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్ పరీక్ష జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1402 ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఐబీపీఎస్ ఎస్‌వో మెయిన్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.








