SBI Clerks 2024 Results: ఎస్‌బీఐ క్లర్కు పోస్టుల ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఫిబ్రవరి 25 నుంచి మెయిన్స్

జూనియర్ అసోసియేట్ (క్లర్క్) ఉద్యోగాల ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్) ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ ) శుక్రవారం (ఫిబ్రవరి 16న) విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ లో ఫలితాలను చూసుకోవచ్చు. ఈ పరీక్షను ఈ ఏడాది జనవరి 5, 6, 11, 12 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా మొత్తం 8773 క్లర్క్‌ పోస్టుల భర్తీకి ఎస్బీఐ నియామక ప్రక్రియ చేపడుతోంది..

SBI Clerks 2024 Results: ఎస్‌బీఐ క్లర్కు పోస్టుల ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఫిబ్రవరి 25 నుంచి మెయిన్స్
SBI Clerks 2024 Results
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 16, 2024 | 4:43 PM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: జూనియర్ అసోసియేట్ (క్లర్క్) ఉద్యోగాల ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్) ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ ) శుక్రవారం (ఫిబ్రవరి 16న) విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ లో ఫలితాలను చూసుకోవచ్చు. ఈ పరీక్షను ఈ ఏడాది జనవరి 5, 6, 11, 12 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా మొత్తం 8773 క్లర్క్‌ పోస్టుల భర్తీకి ఎస్బీఐ నియామక ప్రక్రియ చేపడుతోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో 525 పోస్టులు, అమరావతి సర్కిల్లో 50 పోస్టులు ఉన్నాయి. ప్రిలిమ్స్‌ పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిబ్రవరి 25, మార్చి 4 తేదీల్లో ప్రధాన పరీక్ష (మెయిన్స్) నిర్వహించనున్నట్లు ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

తెలంగాణ డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 793 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను గురుకుల నియామక బోర్డు గురువారం (ఫిబ్రవరి 15) ప్రకటించింది. మొత్తం 22 సబ్జెక్టులకు ఆ పరీక్షను నిర్వహించింది. రాత పరీక్షల్లో ప్రతిభ చూపిన అభ్యర్థులను సబ్జెక్టుల వారీగా 1:2 నిష్పత్తిలో ఎంపిక చేసి, జాబితాలను వెల్లడించింది. అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనతో పాటు డెమో తరగతుల నిర్వహణకు కూడా బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఈ ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు తెలిసింది. ఇక జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ఫలితాలు కూడా ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. వీరికి డెమో తరగతులు ఫిబ్రవరి 22 నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో బోర్డు ఉందని సమాచారం.

ఫిబ్రవరి 24 నుంచి తెలంగాణ సాంకేతిక కోర్సు పరీక్షలు

తెలంగాణ టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పరీక్షల విభాగం సంచాలకుడు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టౌకెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే