AP DSC 2024 Jobs: ఎస్‌జీటీ పోస్టుల్లో ‘బీఈడీ’కి అనుమతివ్వడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మొత్తం 6100 పోస్టుల్లో టీజీటీ, ఎస్‌జీటీ, ఎస్‌ఏ, పీజీటీ పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టింది. అయితే వీటిల్లో సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్‌జీటీ) పోస్టుల భర్తీలో బీఈడీ డిగ్రీ ఉన్న వారికి కూడా అనుమతిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు..
అమరావతి, ఫిబ్రవరి 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మొత్తం 6100 పోస్టుల్లో టీజీటీ, ఎస్‌జీటీ, ఎస్‌ఏ, పీజీటీ పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టింది. అయితే వీటిల్లో సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్‌జీటీ) పోస్టుల భర్తీలో బీఈడీ డిగ్రీ ఉన్న వారికి కూడా అనుమతిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 1 నుంచి 5వ తరగతులకు బోధించే ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారిని అనుమతించడాన్ని సవాలు చేస్తూ గురువారం (ఫిబ్రవరి 15) హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఎస్‌జీటీ, బీఈడీ అభ్యర్థులకు సమాన అర్హత కల్పిస్తూ ఇచ్చిన నిబంధనను రద్దు చేయాలని కోరుతూ అద్దంకికి చెందిన బొల్లా సురేష్ అనే వ్యక్తి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
సీటెట్ 2024 ఫలితాలు విడుదల.. ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి
సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జనవరి-2024 ఫలితాలను సీబీఎస్‌ఈ తాజాగా విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రోల్ నంబర్ వివరాలను నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు. జనవరి 21న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను సీబీఎస్సీ విడుదల చేసింది. కాగా సీటెట్పరీక్ష ఏటా రెండుసార్లు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష రెండు పేపర్‌లకు ఉంటుంది. మొదటి పేపర్ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం నిర్వహిస్తారు. రెండో పేపర్ఆరు నుంచి 9వ తరగతి వరకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్‌లో ఒక్కసారి స్కోర్ సాధిస్తే అది లైఫ్లాంగ్వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. సీటెట్లోస్కోర్ సాధించిన వారు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. సీటెట్ 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ రాత పరీక్ష అడ్మిట్‌కార్డులు విడుదల.. ఫిబ్రవరి 29 నుంచి పరీక్షలు
కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ ఖాళీల భర్తీకి నిర్వహించనున్న నియామక రాత పరీక్ష అడ్మిట్‌కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26,146 పోస్టులు భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 29 నుంచి మార్చి 12వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగనున్నాయి. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్, హిందీతోపాటు తెలుగుతో సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష జరుగుతుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ అడ్మిట్‌కార్డు కోసం క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.