Solar Eclipse: ఈ ఏడాదిలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది.. మన దేశంలో ప్రభావం ఉంటుందా తెలుసుకోండి..

2024 సంవత్సరంలో 4 సార్లు ఏర్పడనున్నాయి. వీటిలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస్య తిథి రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుందో..  అది ఎక్కడ కనిపిస్తుందో ఈరోజు తెలుసుకుందాం.. చైత్ర మాసంలోని కృష్ణ పక్షం అమావాస్య రోజున సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. గ్రహణ సూతక కాలం ఏప్రిల్ 8న ఉదయం 9.12 గంటలకు ప్రారంభమవుతుంది.

Solar Eclipse: ఈ ఏడాదిలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది.. మన దేశంలో ప్రభావం ఉంటుందా తెలుసుకోండి..
Solar Eclipse 2024
Follow us
Surya Kala

|

Updated on: Feb 16, 2024 | 4:07 PM

మన జీవితంలో గ్రహాలు, నక్షత్రాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థానాల్లో మార్పులతో వ్యక్తి అదృష్టంలో మార్పులు ఉంటాయి. వీటిలో సూర్య, చంద్ర గ్రహణాలు చాలా ముఖ్యమైనవి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఖగోళ సంఘటనలు..  2024 సంవత్సరంలో 4 సార్లు ఏర్పడనున్నాయి. వీటిలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస్య తిథి రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుందో..  అది ఎక్కడ కనిపిస్తుందో ఈరోజు తెలుసుకుందాం..

2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందంటే

2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8, 2024 సోమవారం నాడు ఏర్పడనుంది.

మొదటి సూర్యగ్రహణం సమయం:  ఏప్రిల్ 8 న రాత్రి 09:12 నుండి 01:25 వరకు ఉంటుంది. అంటే  సూర్యగ్రహణం ఏర్పడే మొత్తం సమయం 4 గంటల 39 నిమిషాలు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఏడాదిలో మొదటి సూర్యగ్రహణ సూతక కాలం?

చైత్ర మాసంలోని కృష్ణ పక్షం అమావాస్య రోజున సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. గ్రహణ సూతక కాలం ఏప్రిల్ 8న ఉదయం 9.12 గంటలకు ప్రారంభమవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం సూతకాల కాలం 12 గంటల ముందు ప్రారంభమవుతుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీని కారణంగా దాని సుతక కాలం భారతదేశంలో ఉండదు.

సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?

ఏప్రిల్ 8, సోమవారం సంభవించే సూర్యగ్రహణాన్ని భారతదేశంలో కనిపించదు. ఈ సూర్యగ్రహణం తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర ధ్రువం, ఉత్తర అమెరికా, నైరుతి యూరప్, దక్షిణ అమెరికా, దక్షిణ ధృవం, ఉత్తర ధ్రువంపై కనిపిస్తుంది.

సూర్యగ్రహణం సమయంలో ఏమి చేయకూడదు?

సూర్యగ్రహణం సమయంలో ఇంటి నుంచి బయటకు రాకూడదని.. అలాగే సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడకూడదని చెబుతారు. సూర్యగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లడం నిషేధించబడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం గర్భాన్ని ప్రభావితం చేస్తుంది.. కనుక గర్భిణీ స్త్రీలు సూర్యగ్రహణం సమయంలో ఆరుబయట వెళ్లకూడదు. అలాగే గ్రహణ సమయంలో కుట్టుపని, అల్లికలు చేయకూడదు. ఈ సూతక కాలంలో గోళ్లను కత్తిరించకూడదు. ఇంట్లోని పూజ గదిలో ఉన్న దేవుడి విగ్రహాలను తాకరాదు. అయితే  గ్రహణ సమయంలో మంత్రాలను పఠించవచ్చు. గ్రహణ సమయంలో వంటగదికి సంబంధించిన పనులు వంట చేయడం వంటివి చేయకూడదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?