- Telugu News Photo Gallery What To Do If You Have Accidentally Consumed Expired Food? How Can You Be Saved
Expired Food Side Effects: పొరపాటున గడువు తీరిన ఆహారం తినేశారా? ప్రాణాపాయం తప్పాలంటే వెంటనే ఇలా చేయండి..
విపరీతంగా ఆకలిగా అనిపించినప్పుడు ఎదురుగా ఏం కనిపిస్తే అది ఆలోచించకుండా తినేస్తుంటాం. అది కొన్ని రోజుల క్రితం వండిన ఆహారం కావచ్చు లేదా ప్యాక్ చేసిన ఆహారం కావచ్చు. తొందరలో చాలా సార్లు గడువు ముగిసిన ఆహారాన్ని తింటుంటాం. ఫలితం ప్రాణాంతకం కావచ్చు. కాలం చెల్లిన ఆహారం ఆరోగ్యానికి చాలా హానికరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గడువు ముగిసిన ఆహారం తినడం అంటే విషంతో సమానం. ఇంట్లో వండిన ఆహారాలకంటే ప్యాక్ చేసిన ఆహారాలు మరింత హానికరం..
Updated on: Feb 16, 2024 | 7:45 PM

విపరీతంగా ఆకలిగా అనిపించినప్పుడు ఎదురుగా ఏం కనిపిస్తే అది ఆలోచించకుండా తినేస్తుంటాం. అది కొన్ని రోజుల క్రితం వండిన ఆహారం కావచ్చు లేదా ప్యాక్ చేసిన ఆహారం కావచ్చు. తొందరలో చాలా సార్లు గడువు ముగిసిన ఆహారాన్ని తింటుంటాం. ఫలితం ప్రాణాంతకం కావచ్చు. కాలం చెల్లిన ఆహారం ఆరోగ్యానికి చాలా హానికరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గడువు ముగిసిన ఆహారం తినడం అంటే విషంతో సమానం. ఇంట్లో వండిన ఆహారాలకంటే ప్యాక్ చేసిన ఆహారాలు మరింత హానికరం.

కాలం చెల్లిన ఆహారం తినడం వల్ల ఆహార నాణ్యత దెబ్బతింటుంది. అందులో సాల్మొనెల్లా, ఈ-కోలి వంటి హానికరమైన బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఫలితంగా జ్వరం, అతిసారం ప్రమాదం పెరుగుతుంది. ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడవచ్చు. గడువు ముగిసిన బ్రెడ్‌పై త్వరగా బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాలు పేరుకుపోతాయి. దీని వలన ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. గడువు ముగిసిన బ్రెడ్ తినడం వల్ల విరేచనాలు అయ్యే అవకాశం కూడా ఉంది. గడువు ముగిసిన ఆహారం తినడం వల్ల డయేరియాతో పాటు అలర్జీ, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయి.

అనేక ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి రకరకాల రసాయనాలను ఉపయోగిస్తారు. ఫలితంగా గడువు తీరిన తర్వాత అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. అయితే గడువు తీరిన ఆహారం తింటే ఆరోగ్యం పాడవడం వాస్తవమేగానీ, ఆసుపత్రి పాలయ్యి, మరణం సంభవిస్తుందని అనుకోవడం సరికాదు.

ఎప్పుడైనా పొరపాటున గడువు తీరిన ఆహారం తింటే భయపడవద్దని నిపుణులు చెబుతున్నారు. తినే సమయంలో జరిగిన పొరపాటును గ్రహించి తగిన చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని సూచిస్తున్నారు. గడువు తీరిన ఆహారం తిన్న వెంటనే తప్పు గమనించి, వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లాలి. ఇలా చేస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు.

అంతకంటే ముందు గడువు ముగిసిన ఆహారం తీసుకున్న వెంనటే అదనంగా నీళ్లు వీలైనంత అధికంగా త్రాగాలి. నీరు శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడానికి కూడా సహాయపడుతుంది. అప్పటికీ ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లండి.




