- Telugu News Photo Gallery Must Include Sprouted Wheat In The Diet You Get These Unbelievable Benefits Telugu Lifestyle News
Sprouted Wheat: మొలకెత్తిన గోధుమలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..! మిరాకిల్స్
మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మొలకెత్తిన ధాన్యాలలో మంచి పోషకాహారం లభిస్తుంది. మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ప్రోటీన్‌కు మంచి మూలం. అంతేకాదు..వీటితో అనేక తీవ్రమైన వ్యాధులను నివారించడానికి దివ్యౌషధంగా పనిచేస్తాయి. అయితే, మీరు ఎప్పుడైనా మొలకెత్తిన గోధుమలను తిన్నారా? మొలకెత్తిన గోధుమల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Updated on: Jun 17, 2024 | 4:10 PM

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: మొలకెత్తిన గోధుమలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు A, B, C, E మొలకెత్తిన గోధుమలలో లభిస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడంలో సహాయపడతాయి.

అధిక బరువును నియంత్రిస్తుంది: మొలకెత్తిన గోధుమలు మీ రోజు ఆహారంలో భాగంగా తీసుకుంటే.. ఎక్కువ సమయంపాటు మీకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే మొలకెత్తిన గోధుమలను తినడం వల్ల శరీరంలో జీవక్రియ పెరుగుతుంది. దీంతో అతిగా తినకుండా ఉంటారు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

పోషకాలు పుష్కలం: మొలకెత్తిన గోధమలలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దీంతో మన శరీర పనితీరు మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకే మన డైట్లో మొలకెత్తిన గోధుమలను ఎదోవిధంగా చేర్చుకునేలా చూడండి.

మధుమేహం బాధితులకు మంచిది: డయాబెటిక్ రోగులకు, మొలకెత్తిన గోధుమలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది డయాబెటిక్ రోగులకు సూపర్ ఫుడ్ అని చెబుతారు. అలాగే, మొలకెత్తిన గోధుమలు తీసుకోవడం వల్ల మన శరీరానికి కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ జింక్ లభిస్తాయి. పోషకాలు అందుతాయి. జీర్ణక్రియ సైతం మెరుగుపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, బీ, ఇ కూడా పుష్కలం.

ఎముకలకు బలం: మొలకెత్తిన గోధుమలు తీసుకోవడం వల్ల ఎముకలు కూడా బలంగా మారతాయి. ఎందుకంటే ఇందులో ఎక్కువ శాతం కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మొలకెత్తిన గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా బలంగా దృఢంగా మారతాయి.

మొలకెత్తిన గోధుమలు ఎలా తయారు చేస్తారంటే.. ఇందుకోసం ముందుగా గోధుమలను శుభ్రంగా కడిగి రాత్రి సమయంలో నానబెట్టుకోవాలి. ఉదయం ఆ నీటిని మార్చి బాగా కడిగి ఓ గుడ్డ లేదా మొలకెత్తే డబ్బాల్లో గాలి చొరబడేలా చూసుకుని సుమారు 12 గంటలపాటు అలాగే పక్కన బెట్టేయాలి. ఆ మార్నాటికి మొలకలు వస్తాయి.




