Tirupati: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. సెప్టెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు కోటా రిలీజ్.. పూర్తి వివరాలు మీ కోసం..

భక్తులకు స్వామివారి దర్శనం సులభతరం చేసే విధంగా టీటీడీ అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ చర్యల్లో భాగంగా స్వామివారిని ఎప్పుడు ఏ సముయంలో దర్శించుకోవాలని భావిస్తే ఆ సమయంలో దర్శించుకునే విధంగా ముందుగానే దర్శనం టికెట్లను, వసతి సదుపాయాలను బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. అంతేకాదు స్వామివారి వివిధ సేవలను దర్శించుకునే అవకాశం కల్పిస్తూ శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల సహా వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను మందుగానే విడుదల చేస్తోంది. ఈ నేపధ్యంలో సెప్టెంబర్ నెల కు సంబంధించిన వివిధ టికెట్ల కోటాను  రేపు అంటే (జూన్ 18 వ తేదీ)నుంచి జూన్ 27 వ తేదీ వరకూ ఆన్ లైన్ లో రిలీజ్ చేయనుంది. 

Tirupati: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. సెప్టెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు కోటా రిలీజ్.. పూర్తి వివరాలు మీ కోసం..
Tirumala Rush 9
Follow us

|

Updated on: Jun 17, 2024 | 4:25 PM

కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రముఖుల నుంచి సామాన్యులు సైతం కోరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటారు. శ్రీవారి దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. అయితే భక్తులకు స్వామివారి దర్శనం సులభతరం చేసే విధంగా టీటీడీ అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ చర్యల్లో భాగంగా స్వామివారిని ఎప్పుడు ఏ సముయంలో దర్శించుకోవాలని భావిస్తే ఆ సమయంలో దర్శించుకునే విధంగా ముందుగానే దర్శనం టికెట్లను, వసతి సదుపాయాలను బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. అంతేకాదు స్వామివారి వివిధ సేవలను దర్శించుకునే అవకాశం కల్పిస్తూ శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల సహా వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను మందుగానే విడుదల చేస్తోంది. ఈ నేపధ్యంలో సెప్టెంబర్ నెల కు సంబంధించిన వివిధ టికెట్ల కోటాను  రేపు అంటే (జూన్ 18 వ తేదీ)నుంచి జూన్ 27 వ తేదీ వరకూ ఆన్ లైన్ లో రిలీజ్ చేయనుంది.  https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా

జూన్ 18న తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను రేపు ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.  ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన భక్తులకు లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

ఆర్జిత బ్రహ్మోత్సవం

జూన్ 21వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

వర్చువల్ సేవల కోటా

జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సెప్టెంబర్ నెల కోటాకు సంబంధించిన వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

అంగప్రదక్షిణం టోకెన్లు

జూన్ 22న ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా

జూన్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను ఆన్ లైన్ లో రిలీజ్ చేయనుంది.

ఉచిత వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

జూన్ 22న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు  తిరుమల శ్రీ‌వారిని ఉచితంగా ద‌ర్శించుకునేందుకు వీలుగా టోకెన్ల కోటాను రిలీజ్ చేయనుంది.

స్పెషల్ ఎంట్రీ టికెట్స్

జూన్ 24న ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా

జూన్ 24న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిల‌లో సెప్టెంబర్ నెల‌కు సంబంధించిన  గదుల కోటాను రిలీజ్ చేయనున్నారు.

శ్రీవారి సేవ కోటా

జూన్ 27న తిరుమ‌ల,  తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!
నేతాజీ గురించి తెలుసుకోవాలని ఉందా.? ఇది మీ కోసమే..
నేతాజీ గురించి తెలుసుకోవాలని ఉందా.? ఇది మీ కోసమే..
సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ వర్షంతో రద్దయితే.. ట్రోఫీ గెలిచేది.?
సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ వర్షంతో రద్దయితే.. ట్రోఫీ గెలిచేది.?
ఆ సంస్థల్లో ఎఫ్‌డీలపై వడ్డీ జాతర..!
ఆ సంస్థల్లో ఎఫ్‌డీలపై వడ్డీ జాతర..!