AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaal Sarp Dosha: జాతకంలో కాల సర్ప దోషమా.. ఆర్ధిక ఇబ్బందులా.. నివారణ చర్యలు.. ఈ క్షేత్ర దర్శనంతో అద్భుత ఫలితం

కాలసర్ప అంటే కాలం సర్పముగా మారి జాతకులకు అనేక రకాల కష్టాలు రకరకాల ఇబ్బందులను కలిగించడాన్ని కాలసర్ప యోగం లేదా కాలసర్పదోషం అని అంటారు. ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషం ఉంటే అతనికి చాలా బాధ కలుగుతుంది. ఈ దోషం ఉన్నవారు డబ్బు కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. ఆర్థిక నష్టాలు ఎక్కువ. జాతకంలో ఈ దోషం ఉంటే జీవితంలో అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. చేపట్టిన పని చెడిపోవడం ప్రారంభమవుతుంది. భారీ మొత్తంలో డబ్బు నష్టం కలుగుతుంది.

Kaal Sarp Dosha: జాతకంలో కాల సర్ప దోషమా.. ఆర్ధిక ఇబ్బందులా.. నివారణ చర్యలు.. ఈ క్షేత్ర దర్శనంతో అద్భుత ఫలితం
Kaal Sarp Dosha
Surya Kala
|

Updated on: Jun 17, 2024 | 2:55 PM

Share

హిందూ మతంలో వ్యక్తి జీవితం జాతకం చాలా ముఖ్యమైనది. ఎవరి జాతకంలోనైనా కాల సర్పదోషం ఉంటే కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాల సర్ప దోషం అంటే కాల అంటే సమయం అని.. సర్పం అంటే పాము అని అర్థం.. కాలసర్ప అంటే కాలం సర్పముగా మారి జాతకులకు అనేక రకాల కష్టాలు రకరకాల ఇబ్బందులను కలిగించడాన్ని కాలసర్ప యోగం లేదా కాలసర్పదోషం అని అంటారు. ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషం ఉంటే అతనికి చాలా బాధ కలుగుతుంది. ఈ దోషం ఉన్నవారు డబ్బు కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. ఆర్థిక నష్టాలు ఎక్కువ. జాతకంలో ఈ దోషం ఉంటే జీవితంలో అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. చేపట్టిన పని చెడిపోవడం ప్రారంభమవుతుంది. భారీ మొత్తంలో డబ్బు నష్టం కలుగుతుంది.

హిందూ సంప్రదాయం ప్రకారం.. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబకేశ్వర ఆలయంలో కాల సర్ప దోష నివారణ కు అత్యంత ప్రసిద్ద పుణ్య క్షేత్రం. హిందూ మత విశ్వాసం ప్రకారం 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ నాగ పంచమి లేదా ఇతర ప్రత్యేక పండుగల సమయంలో కాల సర్ప దోషానికి ప్రత్యేక పూజలు చేస్తారు.

ఈ చర్యల ద్వారా కాలసర్ప దోషం తొలగిపోతుంది

  1. కాల సర్ప దోషాన్ని నివారించడానికి.. గణేశుడిని పూజించడం చాలా ప్రయోజనకరం.
  2. గణేశుడు కేతువు గ్రహం వలన కలిగే దుఃఖం నుంచి ఉపశమనం ఇస్తాడు. సరస్వతీ దేవి పూజ రాహు దోషం నుంచి రక్షిస్తుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. ప్రతిరోజూ భైరవాష్టకం చదవడం, పూజించడం ద్వారా కాల సర్ప దోషానికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
  5. కాల సర్ప దోషాన్ని తొలగించడానికి మహామృత్యుంజయ మంత్రాన్ని రుద్రాక్ష జపమాలతో ప్రతిరోజూ 108 సార్లు జపించాలి.
  6. కాల సర్ప దోషాన్ని నివారించడానికి, బుధవారం నాడు చిటికెన వేలికి ప్రత్యేకంగా పూజ చేసిన, పవిత్రమైన ఉంగరాన్ని ధరించండి.
  7. కాల సర్ప దోషాన్ని తొలగించడానికి ప్రతి బుధవారం ఒక నల్లని బట్ట తీసుకుని మినప పప్పు, లేదా శనగలు, రాహు మంత్రాన్ని జపించి, అవసరమైన వ్యక్తికి దానం చేయండి.

కాలసర్ప దోష నివారణకు ఈ మహాదేవుని ఆలయంలో పూజ

మత విశ్వాసం ప్రకారం నాసిక్ లోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం కాల సర్ప దోష ఆరాధనకు చాలా ప్రసిద్ధి చెందింది. కాల సర్ప దోషం నుండి ఉపశమనం పొందేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ దేవాలయానికి చేరుకుంటారు. ఈ పవిత్ర జ్యోతిర్లింగ దర్శనం ద్వారా కాలసర్ప దోషం నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం.

కాల సర్ప దోషం తొలగిపోవడానికి పూజలు చేసేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు ఈ శివాలయానికి వస్తుంటారు. ఇక్కడ కాల సర్ప దోషాన్ని పూజించడానికి కనీసం 3 గంటలు పడుతుంది. కాల సర్ప దోషం దుష్ప్రభావాలను నివారించడానికి, ఈ ఆలయం కూడా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇక్కడ శివుడు మహామృత్యుంజయ రూపంలో దర్శనం ఇస్తాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.