AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holy River: నదీ స్నానానికి కొన్ని నియమాలు.. రాత్రి సమయంలో నదీ స్నానం చేయకూడదు అంటారు.. ఎందుకో తెలుసా..

ప్రస్తుతం ఈ పని ఈ సమయంలోనే అనే నియమం ఏమీ లేదు. నేటి జనరేషన్ ఏ పనినైనా ఎప్పుడైనా చేయగలరు. సూర్యోదయ సమయంలో నిద్ర లేచి స్నానం చేయడం అన్న నియమం నుంచి ఉదయం సాయత్రం, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడైనా నిద్ర లేవగలరు, ఎప్పుడైనా స్నానం చేయగలరు. అదే విధంగా పవిత్ర నదుల్లో సూర్యాస్తమయం తర్వాత లేదా రాత్రి సమయంలో కూడా స్నానం చేస్తున్నారు నేటి యువత. సూర్యాస్తమయం తర్వాత లేదా రాత్రి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని.. నదుల్లో తక్కువ రద్దీ ఉంటుందని ఇలా రకరకాల రీజన్స్ చెబుతారు కూడా..

Holy River: నదీ స్నానానికి కొన్ని నియమాలు.. రాత్రి సమయంలో నదీ స్నానం చేయకూడదు అంటారు.. ఎందుకో తెలుసా..
River Bath After Sunset
Surya Kala
|

Updated on: Jun 15, 2024 | 8:13 PM

Share

హిందూ మతంలో నదులకు ముఖ్యస్థానం ఉంది. గంగ, యమునా, సరస్వతి, గోదావరి, కృష్ణా ఇలా ప్రతి నదిని భగవంతుడి అవతారాలుగా భావించి పూజిస్తారు. తల్లిగా భావించి గౌరవిస్తారు. పూర్వకాలం నుంచి నదులను అత్యంత పవిత్రమైనవిగా పాపాలు పోగొట్టే మహామహినత్వమైన శక్తి గలవిగా భావిస్తూనే ఉన్నారు. నదీ స్నానం చేయడం వల్ల పాపాలు తొలిగి పోతాయని పెద్దలు. నదీ స్నానం చేయడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం తో పాటు, పాపాలు పోతాయని నమ్మకం. అయితే సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం నదీస్నానం ఆచరించేందుకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..!

పవిత్ర నదులలో స్నానం ప్రాముఖ్యత

హిందువులు పవిత్రంగా భావించే నదుల్లో గంగా నదికి విశిష్ట స్థానం ఉంది. ఈ గంగా నదిలో స్నానం చేయడానికి గంగా నది ప్రవహించే కాశి, ప్రయాగ, హరిద్వార్, రిషికేశ్ ప్రాంతాలకు భక్తులు పోటేత్తుతారు. గంగా నది కేవలం నది కాదు.. దానిని ‘గంగమాత’ అని పిలుస్తారు. హిందూ మతం విశ్వాసం ప్రకారం గంగా నదిలో స్నానం చేయడం వల్ల ఆత్మ శుద్ధి అవుతుంది. మోక్షం లభిస్తుంది. మకర సంక్రాంతి, కుంభమేళా, గంగా దసరా వంటి పండుగలలో లక్షలాది మంది ప్రజలు తమ పాపాలను పోగొట్టుకోవడానికి.. సుఖ వంతమైన జీవితాన్ని గడపడానికి గంగలో స్నానం చేయడానికి సుదూర ప్రాంతాల ఆయా ప్రాంతాలకు చేరుకుంటారు.

శ్లోకం: గంగేచ యమునే చైవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అని శ్లోకం చెబుతూ స్నానం చేసినచో మనకు పుష్కర స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని నమ్మకం.

ఇవి కూడా చదవండి

మారుతున్న కాలం మారుతున్న సంప్రదాయం

మారుతున్న కాలంలో. ప్రజల అలవాట్లు, ఆచార సంప్రదాయాలను అనుసరించడంలో కూడా అనేక మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ పని ఈ సమయంలోనే అనే నియమం ఏమీ లేదు. నేటి జనరేషన్ ఏ పనినైనా ఎప్పుడైనా చేయగలరు. సూర్యోదయ సమయంలో నిద్ర లేచి స్నానం చేయడం అన్న నియమం నుంచి ఉదయం సాయత్రం, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడైనా నిద్ర లేవగలరు, ఎప్పుడైనా స్నానం చేయగలరు. అదే విధంగా పవిత్ర నదుల్లో సూర్యాస్తమయం తర్వాత లేదా రాత్రి సమయంలో కూడా స్నానం చేస్తున్నారు నేటి యువత. సూర్యాస్తమయం తర్వాత లేదా రాత్రి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని.. నదుల్లో తక్కువ రద్దీ ఉంటుందని ఇలా రకరకాల రీజన్స్ చెబుతారు కూడా.. అందుకనే ఎక్కువ మంది ఇప్పుడు నదుల్లో కూడా సూర్యాస్తమయం తర్వాత స్నానం చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వలన తమ జీవితంలో తామే సమస్యలను ఆహ్వానిస్తున్నామని వారికీ తెలియదు.

నదిలో రాత్రి సమయంలో స్నానం చేయడం వలన కలిగే దోషాలు..

హిందూ మత విశ్వాసాల ప్రకారం నదీ స్నానం నిర్దిష్టమైన సమయంలో మాత్రమే స్నానం చేయాలి. సాంప్రదాయకంగా పవిత్రమైన నదులలో స్నానం చేయడం ఆరోగ్యానికి మేలు. పురాణాల ప్రకారం రాత్రి సమయంలో యక్షులు పవిత్ర నదుల దగ్గర స్నానం చేసి కూర్చుంటారని నమ్మకం. యక్షులు నీరు, అడవులు, చెట్లు మొదలైన వాటితో సంబంధం ఉన్న ప్రకృతి సంబంధించిన వ్యక్తులు. ఈ జీవులు రాత్రి సమయంలో చురుకుగా కదులుతాయని.. రాత్రి నదుల వద్ద సంచరిస్తాయని విశ్వాసం. కనుక రాత్రి సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేయడం నిషేధం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.