AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bird Poop Facial: అందం కోసం కొత్త ట్రెండ్.. పక్షి రెట్టతో ఫేషియల్.. కొంచెం ఖరీదైనా ఎగబడుతున్న జనం..

గత కొంత కాలంగా ఒక కొత్త బ్యూటీ ట్రెండ్ నడుస్తోంది. దీని పేరు బర్డ్ పూప్ ఫేషియల్. అంటే పక్షి రెట్టతో ఫేషియల్. ఈ పేరు విన్న మీకు నచ్చకపోవచ్చు. అయితే ఈ బర్డ్ పూప్ ఫేషియల్ శతాబ్దాలుగా ఆసియా దేశాలైన జపాన్ , చైనాల్లో ఉపయోగిస్తూనే ఉన్నారు. ఈ ఫేషియల్ అందం పోకడలలో ఒక భాగంగా ఉంది. అయితే ఈ ఫేషియల్ కొంచెం ఖరీదైనదే.

Bird Poop Facial: అందం కోసం కొత్త ట్రెండ్.. పక్షి రెట్టతో ఫేషియల్.. కొంచెం ఖరీదైనా ఎగబడుతున్న జనం..
Bird Poop Facial
Surya Kala
|

Updated on: Jun 15, 2024 | 6:53 PM

Share

అందమైన చర్మం పొందడానికి ఆడ మగ అనే తేడా లేకుండా అనేక రకాల ప్రయోగాలను చేస్తూనే ఉన్నారు. స్కిన్ కేర్ కోసం మార్కెట్ లో దొరికే వాటితోనే కాదు.. ఇంట్లో దొరికే ఉండే సహజ పదార్ధాలతో కూడా ఫేషియల్ చేసుకుంటారు. అయితే రోజుకో రకం ఫ్యాషన్ ఎలా మార్కెట్ లోకి వస్తుందో.. అదే విధంగా అందాల ప్రపంచంలో కూడా కొత్త ట్రెండ్స్ వస్తూనే ఉన్నాయి. గత కొంత కాలంగా ఒక కొత్త బ్యూటీ ట్రెండ్ నడుస్తోంది. దీని పేరు బర్డ్ పూప్ ఫేషియల్. అంటే పక్షి రెట్టతో ఫేషియల్. ఈ పేరు విన్న మీకు నచ్చకపోవచ్చు. అయితే ఈ బర్డ్ పూప్ ఫేషియల్ శతాబ్దాలుగా ఆసియా దేశాలైన జపాన్ , చైనాల్లో ఉపయోగిస్తూనే ఉన్నారు. ఈ ఫేషియల్ అందం పోకడలలో ఒక భాగంగా ఉంది. అయితే ఈ ఫేషియల్ కొంచెం ఖరీదైనదే.

హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ కూడా ఈ ఫేషియల్ చేయించుకున్నాడనే చాలా వార్తలు వచ్చాయి. బర్డ్ పూప్ ఫేషియల్ అంటే పక్షి రెట్ట లేదా మలంతో ముఖం అందం పెంచడానికి చేసే పద్దతి. . ఇది చదివిన మీరు ఛీ అంటూ మొహం చాటేయడం మొదలుపెట్టినా.. విదేశాల్లో భారీ సంఖ్యలో ఈ ఫేషియల్ కోసం క్యూలు కడుతున్నారు. మరి ఈ పక్షి రెట్ట ఫేషియల్ గురించి తెలుసుకుందాం…

జపాన్ లో ప్రారంభం

ఈ ఫేషియల్‌ను ఉగుయిసు నో ఫన్ అని కూడా అంటారు. వాస్తవానికి ఈ పక్షి రెట్ట ఫేషియల్ కు జపాన్ పుట్టినిల్లు. అయితే ఇది చైనాలో అత్యంత ప్రజాదరణ పొందింది. జపనీస్ , చైనీస్ ప్రజలు పక్షి మలం చర్మం ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలను కలిగి ఉంటుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

దీనిని ఎలా చేస్తారంటే

ప్రతి పక్షి మలంతో మనం ఫేషియల్ చేయించుకోగలమా అని కొందరిలోనైనా ఈ ప్రశ్న తప్పక ఉదయిస్తుంది. అయితే ఈ ఫేషియల్ కోసం కోయిల రెట్టని ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. చైనీస్ చర్మ సంరక్షణ ప్రకారం కోయిల రెట్ట చర్మానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

కోయిల రెట్టలో వరి పిండి కలుపుతారు. ఈ మిశ్రమానికి కొంచెం నీరు కలిపి పేస్ట్ తయారు చేస్తారు. తర్వాత ముఖానికి అప్లై చేస్తారు. ఇది బాగా ఆరిపోయిన తర్వాత సాధారణ గోరు వెచ్చటి నీటితో కడగాలి. ఇందులో ఉండే శక్తివంతమైన ఎంజైమ్‌లు మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడతాయని నమ్ముతారు. దీంతో చర్మం బిగుతుగా మారి ముడతలు కూడా తొలగిపోతాయి.

ప్రభావవంతంగా పని చేసే ఫేషియల్

చైనీస్ చర్మ సంరక్షణ ప్రకారం.. ఈ ఫేషియల్ ముఖ చర్మంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అయితే ఈ ఫేషియల్ ను కేవలం ప్రొఫెషనల్స్ తో మాత్రమే చేయించుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..