Uttar Pradesh: హోటల్‌కి పిలిచి మరీ ప్రియుడి పీక కోసి హత్యాయత్నం చేసిన ప్రియురాలు ఎక్కడంటే

ఓ ప్రేయసి తన బాయ్‌ఫ్రెండ్‌ను హత్య చేయాలనీ కసిదీరా పొడిచిన హృదయ విదారక సంఘటన కు సంబంధించిన వివరాలను లక్నో పోలీసులు వెల్లడించారు. హోటల్‌లో రాత్రి బస చేసేందుకు ప్రియురాలు తన బాయ్ ఫ్రెండ్ ను పిలిచింది. అయితే ఇద్దరి మధ్య ఏదో సమస్య తలెత్తినట్లు ఉంది. దీంతో ప్రేమికులు ఇద్దరూ గొడవ పడ్డారు. కోపంతో ప్రియురాలు .. తన ప్రియుడి చేతులు, కాళ్లు కట్టేసింది. ఆపై హత్య చేయాలనే ఉద్దేశంతో కత్తితో పలుమార్లు అతడిని పొడిచింది.

Uttar Pradesh: హోటల్‌కి పిలిచి మరీ ప్రియుడి పీక కోసి హత్యాయత్నం చేసిన ప్రియురాలు ఎక్కడంటే
Lucknow Crime News
Follow us
Surya Kala

|

Updated on: Jun 15, 2024 | 5:18 PM

కొన్ని కొన్ని సంఘటలు చూస్తుంటే నేరం చేయడనికి ఆడ, మగ అనే తేడా లేదు అనిపిస్తుంది. కోపంలో విచక్షణను క్షణ కాలం కోల్పోతే చాలు హత్య చేసే వరకూ వెళ్ళొచ్చు అని అనేక సంఘటలు నిరూపిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేయసి తన బాయ్‌ఫ్రెండ్‌ను హత్య చేయాలనీ కసిదీరా పొడిచిన హృదయ విదారక సంఘటన కు సంబంధించిన వివరాలను లక్నో పోలీసులు వెల్లడించారు. హోటల్‌లో రాత్రి బస చేసేందుకు ప్రియురాలు తన బాయ్ ఫ్రెండ్ ను పిలిచింది. అయితే ఇద్దరి మధ్య ఏదో సమస్య తలెత్తినట్లు ఉంది. దీంతో ప్రేమికులు ఇద్దరూ గొడవ పడ్డారు. కోపంతో ప్రియురాలు .. తన ప్రియుడి చేతులు, కాళ్లు కట్టేసింది. ఆపై హత్య చేయాలనే ఉద్దేశంతో కత్తితో పలుమార్లు అతడిని పొడిచింది.

ఈ ఘటన నగరంలోని గోసాయిగంజ్‌లో జరిగినట్లు పోలీసులు తెలిపారు. గోసాయిగంజ్ నివాసి 25 ఏళ్ల అంకిత్ .. చార్మటోలియా నివాసి 19 ఏళ్ల రేణు రావత్ ప్రేమించుకుంటున్నారు. రేణు ఖుర్దాహి బజార్‌లోని ఏఆర్ హోటల్‌లో రాత్రి ఉండడానికి తన బాయ్ ఫ్రెండ్ అంకిత్‌ను పిలిచింది. ప్రియురాలి పిలుపుని అందుకున్న అంకిత్ హోటల్ కు చేరుకున్నారు. రాత్రి ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారు. అర్ధరాత్రి 4 గంటల ప్రాంతంలో ఏదో విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

అంకిత్ అరుస్తూనే ఉన్నా.. లెక్క చేయని రేణు

రేణు, అంకిత్ మధ్య చాలా కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అందుకనే రేణు పిలవగానే అంకిత్ హోటల్‌కు వెళ్లాడు. ఇద్దరూ కలిసి గదిలో ఉండగా తెల్లవారు జామున 4 గంటలకు ఏదో విషయంలో గొడవ జరిగింది. దీని తర్వాత కోపంతో రేణు.. అంకిత్ చేతులు, కాళ్ళను కట్టివేసింది. ఆ తర్వాత అంకిత్‌ని హత్య చేసేందుకు మెడపై కత్తితో పొడిచింది. కాళ్లు, చేతులు బంధించి ఉండడంతో అంకిత్ ఏమీ చేయలేకపోయాడు. అయినప్పటికీ ప్రాణభీతితో అతను అరుస్తూనే ఉన్నాడు. అయినా రేణు అతని మాట వినలేదు. అరుపులు లెక్క చేయలేదు.

ఇవి కూడా చదవండి

పోలీసులు అదుపులో ప్రియురాలు

ఈ బ్లడీ గేమ్ గురించి పోలీసులకు తెలియడంతో.. వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వెంటనే చికిత్స నిమిత్తం అంకిత్‌ను కేజీఎంయూ హాస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం అంకిత్ చికిత్స పొందుతున్నాడు. అతని శరీరంపై చాలా గాయాలు అయ్యానని.. మెడపై కత్తితో దాడి జరిగిందని పోలీసులు చెప్పారు. మరోవైపు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా ప్రియురాలు రేణుపై ఐపీసీ సెక్షన్ 342/323/324/307 కింద హత్యాయత్నం సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రేణును అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..