AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagannath Rath Yatra 2024: గుజరాత్‌లో రథయాత్రకు జగన్నాథుడు రెడీ.. స్పెషల్ వస్త్రధారణతో అన్న చెల్లితో కలిసి విహారం..

పూరి జగన్నాథుడి ఆలయం తర్వాత గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న జగన్నాథ దేవాలయం ప్రపంచ ఖ్యాతిగాంచింది.  ఈ ఆలయం దాని వార్షిక రథోత్సవం, రథయాత్రకు ప్రసిద్ధి చెందింది. దేశంలో అత్యంత ఘన మైన రథయాత్రలో రెండవదిగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది జగన్నాథుని 147వ రథయాత్ర జూలై 7న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో భగవాన్ జగన్నాథుడు తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి నగర పర్యటనకు వెళ్లనున్నారు.

Jagannath Rath Yatra 2024: గుజరాత్‌లో రథయాత్రకు జగన్నాథుడు రెడీ.. స్పెషల్ వస్త్రధారణతో అన్న చెల్లితో కలిసి విహారం..
Jagannath Temple Ahmedabad
Surya Kala
|

Updated on: Jun 15, 2024 | 3:48 PM

Share

ప్రపంచ ప్రసిద్దిగాంచిన జగన్నాథుని రథయాత్ర కోసం దేశ విదేశాల భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. జగన్నాథుడు అన్న చెల్లెలతో కలిసి చేసే రథయాత్రను ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రథ యాత్రలో దేశం నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి సైతం లక్షలాది సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. అయితే ఒడిశా తర్వాత అహ్మదాబాద్ లో జగనాథుడి రథయాత్ర అత్యంత ఘనంగా జరుపుతారు. పూరి జగన్నాథుడి ఆలయం తర్వాత గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న జగన్నాథ దేవాలయం ప్రపంచ ఖ్యాతిగాంచింది.  ఈ ఆలయం దాని వార్షిక రథోత్సవం, రథయాత్రకు ప్రసిద్ధి చెందింది. దేశంలో అత్యంత ఘన మైన రథయాత్రలో రెండవదిగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది జగన్నాథుని 147వ రథయాత్ర జూలై 7న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో భగవాన్ జగన్నాథుడు తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి నగర పర్యటనకు వెళ్లనున్నారు.

డ్రెస్ ప్రత్యేకంగా ఉంటుంది జగన్నాథుడు వివిధ వస్తువులతో చేసిన ప్రత్యేక వస్త్రాలను ధరించి బయటకు వస్తాడు. జగన్నాథుని రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ యాత్రలో శ్రీ కృష్ణుడు, అతని సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర రథంపై ఎక్కి నగర పర్యటనకు వెళతారు. ఈసారి రథయాత్ర కోసం గుజరాత్, మధుర, బృందావనం నుంచి అవసరమైన సామాగ్రి, దుస్తులను కూడా సేకరించారు.

జమాల్‌పూర్ జగదీష్ ఆలయం నుంచి యాత్ర ప్రారంభమవుతుంది రథయాత్రకు ముందు, జూన్ 22 ఉదయం ఆలయంలో సాంప్రదాయ జల ఊరేగింపు నిర్వహించబడుతుంది. సరస్‌పూర్‌ ఆలయంలో శ్రీరాన్ చోడ్రాయ్ ఆలయం, శ్రీ జగన్నాథుడు, సోదరి సుభద్ర , బలరాముడు నగర ప్రయాణం సాంప్రదాయ భక్తి వాతావరణంలో జమాల్‌పూర్ జగదీష్ ఆలయం నుంచి ప్రారంభమవుతుంది.  రోజంతా ప్రయాణం చేసి భగవాన్ జగదీష్, సుభద్ర మరియు బలభద్ర మూర్తుల రథాలు సాయంత్రం 7.00 గంటల తర్వాత ఎప్పుడైనా జగన్నాథ ఆలయానికి తిరిగి వస్తాయి. వీధుల్లో విహరిస్తున్న జగన్నాథుడిని భక్తులందరూ దర్శించుకుంటారు.

ఇవి కూడా చదవండి

ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు ఒడిశా తర్వాత అహ్మదాబాద్ రథయాత్ర రెండవదిగా పరిగణించబడుతుంది. నెలరోజుల ముందే రథయాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. యాత్రకు భారీ ఏర్పాట్లతో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రథయాత్ర జరిగే మార్గం, జమాల్‌పూర్ జగన్నాథ ఆలయంలో కూడా పోలీసులు మోహరించారు.

జగన్నాథ యాత్ర ప్రాముఖ్యత పురాణాల ప్రకారం.. రథయాత్రలో శ్రీ జగన్నాథుని నామస్మరణ చేస్తూ గుండిచా నగర్‌కు వెళ్ళిన వ్యక్తి పునర్జన్మ బంధం నుండి విముక్తి పొందుతాడు. భగవంతుని నామస్మరణతో రథయాత్రలో పాల్గొన్న భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. రథయాత్రలో పాల్గొనడం వల్ల పిల్లలకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు