Weather Alert: రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.! వాతావరణశాఖ అలెర్ట్..

దేశంలోని అనేక రాష్ట్రాలను మాన్సూన్‌ పలకరిస్తోంది. శాటిలైట్‌ చిత్రాన్ని పరిశీలిస్తే.. రెండ్రోజుల్లో మహరాష్ట్ర, తెలంగాణ, కర్నాటక, ఒడిశా, కోస్తాంధ్రల్లో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రత చూస్తే..తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఎండ ఉన్నా..మధ్యాహ్నం భారీ వర్షం పడే చాన్స్‌ ఉంది. తెలంగాణలో పగటివేళ మాగ్జిమం 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది.

Follow us

|

Updated on: Jun 15, 2024 | 7:19 PM

దేశంలోని అనేక రాష్ట్రాలను మాన్సూన్‌ పలకరిస్తోంది. శాటిలైట్‌ చిత్రాన్ని పరిశీలిస్తే.. రెండ్రోజుల్లో మహరాష్ట్ర, తెలంగాణ, కర్నాటక, ఒడిశా, కోస్తాంధ్రల్లో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రత చూస్తే..తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఎండ ఉన్నా..మధ్యాహ్నం భారీ వర్షం పడే చాన్స్‌ ఉంది. తెలంగాణలో పగటివేళ మాగ్జిమం 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఏపీలో 32 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. తీరప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటుంది. జూన్‌ 15 నుంచి రుతుపవనాలు చురుకుదనాన్ని సంతరించుకోనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. అదే సమయంలో ఇవి కోస్తాంధ్రలోని మిగిలిన ప్రాంతాలకు, ఒడిశా, వాయవ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతా­లకు విస్తరించనున్నాయి. ఫలితంగా జూన్‌ 15 నుంచి రాష్ట్రంలో విస్తారంగా వానలు కురవనున్నాయి.

తెలంగాణ విషయానికివస్తే, అల్పపీడన ద్రోణి కారణంగా హైదరాబాద్‌సహా అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ద్రోణి బలపడటం వల్ల కరీంనగర్‌, సిరిసిల్ల, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఉదయం వేళ్లల్లో ఎండ ఉన్నప్పటికీ..మధ్యాహ్నం వర్షం కురిసే అవకాశముంది. మేఘాల వల్ల ఉక్కపోత కూడా ఉంటుంది. ఇక ఏపీ విషయానికి వస్తే.. విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, జిల్లాల్లో భారీ వర్షం పడనుంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షం పడేటపుడు.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలి. చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ అధికారులు సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం: Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Latest Articles
డస్ట్ అలర్జీకి కారణం ఏంటో తెలుసా..? నివారణ మార్గాలు తెలుసుకోండి..
డస్ట్ అలర్జీకి కారణం ఏంటో తెలుసా..? నివారణ మార్గాలు తెలుసుకోండి..
పురుషుల కొంప ముంచుతున్న ప్లాస్టిక్.. దానిపై తీవ్ర ప్రభావం..
పురుషుల కొంప ముంచుతున్న ప్లాస్టిక్.. దానిపై తీవ్ర ప్రభావం..
నారింజతొక్కే కదా అని తీసిపారేయకండి..ఇలా వాడితే గుండె జబ్బులకుచెక్
నారింజతొక్కే కదా అని తీసిపారేయకండి..ఇలా వాడితే గుండె జబ్బులకుచెక్
దాంపత్యానికి ఉన్న బలం ఇదే.. భర్త గుండెలపై తలపెట్టి ఏడుస్తూ..
దాంపత్యానికి ఉన్న బలం ఇదే.. భర్త గుండెలపై తలపెట్టి ఏడుస్తూ..
డిప్యూటీ స్పీకర్ ఎవరు..? సమీకరణాలపై అధినేతల కసరత్తు
డిప్యూటీ స్పీకర్ ఎవరు..? సమీకరణాలపై అధినేతల కసరత్తు
బ్యూటీ పార్లర్‌తో పనిలేదు ఇంట్లోనే ఫేషియల్ గ్లో..! ఈ టిప్స్‌ తో
బ్యూటీ పార్లర్‌తో పనిలేదు ఇంట్లోనే ఫేషియల్ గ్లో..! ఈ టిప్స్‌ తో
ఒకప్పటి కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆసిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
ఒకప్పటి కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆసిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
అబ్బో..! హెబ్బా అందాలు హీటు పుట్టిస్తున్నాయిగా..
అబ్బో..! హెబ్బా అందాలు హీటు పుట్టిస్తున్నాయిగా..
మా నాన్నకు నేను అలా చేయడం ఇష్టం లేదు..
మా నాన్నకు నేను అలా చేయడం ఇష్టం లేదు..
చియా సీడ్స్‌ తింటున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! లేదంటే..
చియా సీడ్స్‌ తింటున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! లేదంటే..