Blood Donation: క్యాన్సర్ రోగులు రక్తదానం చేయవచ్చా? నిపుణులు చెప్పిన సమాధానం ఏమిటంటే

ఆంకాలజీ , హెమటాలజీ డాక్టర్ ఉష్మా సింగ్ మాట్లాడుతూ.. క్యాన్సర్ బాధితులు రక్తదానం చేయాలనే నిర్ణయం అది వారి వ్యక్తిగతమైనది. సాహసోపేతమైనది. అయితే క్యాన్సర్ బాధితులు, క్యాన్సర్ నుంచి కోలుకున్న వారు అందరూ రక్తదానం చేయడానికి అర్హులు కారు. ఏ క్యాన్సర్ రోగులు రక్తదానం చేయవచ్చు? అయితే క్యాన్సర్ రకం, రోగికి ఇచ్చే చికిత్స ,రోగి ప్రస్తుత పరిస్థితిని బట్టి.. క్యాన్సర్ బాధితులు రక్తదానం చేయడానికి అర్హులా కాదా అనే విషయం నిర్ణయిస్తారు.

Blood Donation: క్యాన్సర్ రోగులు రక్తదానం చేయవచ్చా? నిపుణులు చెప్పిన సమాధానం ఏమిటంటే
Blood Donation
Follow us
Surya Kala

|

Updated on: Jun 15, 2024 | 4:25 PM

మానవ రక్తానికి ప్రత్యామ్నాయం లేదు.. కనుక రక్తం దానం చేయండి.. ప్రాణదాతలు కండి.. అవును రక్తం దొరకక మన దేశంలో దాదాపు 12,000 మంది చనిపోతున్నారు. సురక్షితమైన రక్తమార్పిడి అందుబాటులో లేనందున రోగులు తరచుగా ఇబ్బందులు పడుతున్నారు. కనుక అవసరం అయిన వారికి రక్తం ఇవ్వడం గొప్ప బహుమతి. అయితే క్యాన్సర్ రోగులు రక్తదానం చేయవచ్చా లేదా అనే విషయంలో వివిధ రకాల అపోహలు, నమ్మకాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో నిపుణులు చెబుతున్న అభిప్రాయం ఏమిటో తెలుసుకుందాం..

చాలా మంది క్యాన్సర్ బాధితులు లేదా క్యాన్సర్ నుంచి కోలుకున్న వారు రక్తదానంలో చేయడం ద్వారా సాధికారతను అనుభవిస్తారు. మానసికంగా మంచి అనుభూతి చెందుతారు. అదనంగా రక్తదానంలో చేయడం వలన తరచుగా ఆరోగ్య పరీక్షలు .. క్యాన్సర్ బాధితుల ఆరోగ్య స్థితిని పర్యవేక్షించడంలో వీలవుతుంది. అంతేకాదు రక్త దానం చేయడం వలన ఏవైనా వ్యాధుల గురించి సకాలంలో సమాచారాన్ని పొందడంలో సహాయపడుతుంది.

ఇది మాత్రమే కాదు సమాజానికి ఏదైనా మంచి చేయాలనే భావన క్యాన్సర్ బాధితులకు సమాజంతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. ఇది వారి మానసిక స్థితిని మెరుగుపరచడమే కాదు కోలుకోవడానికి కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్ బాధితులు రక్తదానం చేయవచ్చా..

ఆంకాలజీ , హెమటాలజీ డాక్టర్ ఉష్మా సింగ్ మాట్లాడుతూ.. క్యాన్సర్ బాధితులు రక్తదానం చేయాలనే నిర్ణయం అది వారి వ్యక్తిగతమైనది. సాహసోపేతమైనది. అయితే క్యాన్సర్ బాధితులు, క్యాన్సర్ నుంచి కోలుకున్న వారు అందరూ రక్తదానం చేయడానికి అర్హులు కారు.

ఏ క్యాన్సర్ రోగులు రక్తదానం చేయవచ్చు? అయితే క్యాన్సర్ రకం, రోగికి ఇచ్చే చికిత్స ,రోగి ప్రస్తుత పరిస్థితిని బట్టి.. క్యాన్సర్ బాధితులు రక్తదానం చేయడానికి అర్హులా కాదా అనే విషయం నిర్ణయిస్తారు. బేసల్ సెల్ కార్సినోమా అనేది ఓ రకమైన స్కిన్ కాన్సర్ లేదా ఇన్-సిటు క్యాన్సర్ వంటి క్యాన్సర్ రోగులు విజయవంతమైన చికిత్స తర్వాత రక్తదానం చేయవచ్చు. అదే సమయంలో లుకేమియా లేదా లింఫోమా వంటి క్యాన్సర్ ఉన్న రోగులు సాధారణంగా రక్తదానం చేయడానికి అర్హులుగా పరిగణించబడరు.

క్యాన్సర్‌ను ఓడించి.. చికిత్స పూర్తి చేసుకున్న రోగులు కొంత సమయం తర్వాత.. అంటే సాధారణంగా ఒక సంవత్సరం తర్వాత రక్తదానం చేయవచ్చు. దాత మంచి ఆరోగ్యంతో ఉండటం, హిమో గ్లోబిన్ స్థాయి, ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఉండటం చాలా ముఖ్యం.

రక్తదానం చేయడం అభినందనీయమైన చర్య.. అయితే దాత … గ్రహీత ఇద్దరి ఆరోగ్య పరిస్థితి గణన మొదటి స్థానంలో ఉంటుంది. వైద్య రంగంలో రక్తదానం చాలా కీలకమైన భాగంగా మారింది. దీని సహాయంతో శస్త్రచికిత్స, చికిత్స , అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన మద్దతు అందించబడుతుంది. రక్తదానం చేసేందుకు అర్హులైన క్యాన్సర్ బాధితుల సహకారం అమూల్యమైనది. అయితే దాత ఆరోగ్య పరిస్థితి పరిగణ మొదటి స్థానంలో ఉంటుంది.. కనుక రక్త సరఫరా సజావుగా ఉండేలా క్యాన్సర్ బాధితులను నిరంతరం స్క్రీనింగ్ చేయవలసి ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..