Petrol, Diesel Prices: వాహనదారులకు షాక్‌.. భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గతంలో వందకు పైగా పెరిగిన పెట్రోల్‌ ధరలు.. కేంద్రం కొంత తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల తర్వాత పెట్రోల్‌,డీజిల్‌ ధరలు పెరుగుతాయన్న అనుమానాలు చాలా మందిలో తలెత్తింది. అయితే ఇటీవల పెట్రోలియం మంత్రి కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై స్పందించారు...

Petrol, Diesel Prices: వాహనదారులకు షాక్‌.. భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
Petrol
Follow us

|

Updated on: Jun 15, 2024 | 5:23 PM

గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గతంలో వందకు పైగా పెరిగిన పెట్రోల్‌ ధరలు.. కేంద్రం కొంత తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల తర్వాత పెట్రోల్‌,డీజిల్‌ ధరలు పెరుగుతాయన్న అనుమానాలు చాలా మందిలో తలెత్తింది. అయితే ఇటీవల పెట్రోలియం మంత్రి కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై స్పందించారు. ధరలు పెంచే అవకాశాలు లేవని ప్రకటించారు. కానీ కర్ణాటకలో మాత్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 3 రూపాయలు పెరుగగా, లీటర్‌ డీజిల్‌పై రూ.3.20 పెంచుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారులకు మరింత భారంగా మారనుంది. ఈ పెరిగిన ధరలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం కర్ణాటకలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.85కి చేరగా, లీటర్‌ డీజిల్‌ ధర రూ.88.93కి చేరింది.

జూన్ 15న రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై పన్నులు పెంచడంతో కర్ణాటకలో ఇంధన ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, కర్ణాటక సేల్స్ ట్యాక్స్ (కెఎస్‌టి) పెట్రోల్‌పై 25.92 శాతం నుండి 29.84 శాతానికి, డీజిల్‌పై 14.3 శాతం నుండి 18.4 శాతానికి పెరిగింది. కర్ణాటక పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం.. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.102.86 కాగా, డీజిల్ ధర రూ.88.94గా ఉంది. పెరిగిన ధర తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.99.84గా ఉండగా, డీజిల్ ధర రూ.85.93గా ఉంది. కోవిడ్-19 తర్వాత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో సహాయపడటానికి గత బిజెపి రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను లీటరుకు రూ. 13.30, డీజిల్ ధరలను లీటరుకు రూ. 19.40 తగ్గించినప్పుడు నవంబర్ 2021లో చివరి సవరణ జరిగింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇంధన ధరల పెంపు జరిగింది. ఐదు హామీల అమలు కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.50,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంధన ధరల పెంపు వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.2,500-రూ.2,800 కోట్లు సమీకరించవచ్చని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..