Over Speeding Device: కార్ల యజమానులకు గుడ్ న్యూస్.. అతి వేగం సమస్యకు ఆ ఒక్క డివైజ్‌తో చెక్..!
భారతదేశం అత్యధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు సంభవించే దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అతివేగం అనేది తరచుగా ప్రమాదాలకు కారణమవుతూ ఉంటుంది. దేశంలో విక్రయిస్తున్న దాదాపు ప్రతి కారు ఇప్పుడు 80 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తే అలెర్ట్ చేసే సిస్టమ్ ఉంది. 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నిరంతర బీప్ సౌండ్‌తో అలెర్ట్ చేస్తుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఓవర్ స్పీడ్ సమస్యకు పరిష్కారం ఉండడం లేదు. ముఖ్యంగా కొన్ని లక్షలు పోసి కార్లు కొనుగోలు చేసిన వారు డ్రైవర్లు చేసే తప్పు కారణంగా ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు.

ఇటీవల కాలంలో కార్ల వాడకం అనేది విపరీతంగా పెరిగింది. అయితే వినియోగం ఎలా ఉన్నా కార్లను తోలే సమయంలో అతి వేగం అనేది అందరినీ భయపెడుతుంది. నిర్ణీత స్పీడ్‌తో సంబంధం లేకుండా కొందరు రోడ్లపై చక్కర్లు కొడుతూ ఉంటారు. భారతదేశం అత్యధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు సంభవించే దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అతివేగం అనేది తరచుగా ప్రమాదాలకు కారణమవుతూ ఉంటుంది. దేశంలో విక్రయిస్తున్న దాదాపు ప్రతి కారు ఇప్పుడు 80 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తే అలెర్ట్ చేసే సిస్టమ్ ఉంది. 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నిరంతర బీప్ సౌండ్‌తో అలెర్ట్ చేస్తుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఓవర్ స్పీడ్ సమస్యకు పరిష్కారం ఉండడం లేదు. ముఖ్యంగా కొన్ని లక్షలు పోసి కార్లు కొనుగోలు చేసిన వారు డ్రైవర్లు చేసే తప్పు కారణంగా ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ స్పీడ్ సమస్య నుంచి బయటపడేలా ఓ డివైజ్ అందరినీ ఆకట్టుకుంటుంది. అదే ఓవర్ స్పీడ్ డివైజ్. సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులను మెరుగుపరచడం ఈ డివైజ్ కీలకంగా పని చేస్తుంది. ఈ నేపథ్యంలో ఓవర్ స్పీడ్ డివైజ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఓవర్-స్పీడ్ డివైజ్‌ను ఇంటెలిజెంట్ స్పీడ్ అసిస్టెన్స్ సిస్టమ్స్ లేదా ఐఎస్ఏ అని కూడా పిలుస్తారు, వివిధ రహదారుల పై అనుమతించబడిన వేగ పరిమితులను స్కాన్ చేయడంతో పాటు డ్రైవర్లను హెచ్చరించడానికి వీడియో కెమెరా, జీపీఎస్ లింక్డ్ స్పీడ్-లిమిట్ డేటాను సూచిస్తుంది. భారతదేశంలో విక్రయించే అనేక కొత్త కార్లలో ప్రస్తుత వ్యవస్థకు భిన్నంగా ఇది ఉంది. కాబట్టి ఐఎస్ఏ వివిధ రహదారులపై సెట్ చేసిన వివిధ పరిమితులను నిరంతరం పర్యవేక్షిస్తుంది. జూలై నుంచి యూరోపియన్ యూనియన్‌లో విక్రయించే అన్ని కొత్త కార్లపై ఐఎస్ఏ తప్పనిసరి చేశారు. యుఎస్ ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ హైవే సేఫ్టీ నిర్వహించిన సర్వేలో దేశంలోని దాదాపు 60 శాతం మంది డ్రైవర్లు తమ వాహనాల్లో ఐఎస్ఏకు అనుకూలంగా ఉన్నారని తేలింది.
కొత్త కార్లలో ఐఎస్ఏ తప్పనిసరా?
రహదారి భద్రతను మెరుగుపరచడంలో భారతదేశం చాలా ముఖ్యమైన చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా భారతదేశంలో ఎన్‌సీఏపీను ప్రవేశపెట్టి కార్ల నాణ్యత గురించి వినియోగదారులకు ముందుగానే హెచ్చరికలను అందిస్తుంది. అయితే కార్లల్లో ఐఎస్ఏ డివైజ్‌లు ఇన్‌స్టాల్ చేయడం ద్వారా డ్రైవర్లు స్థానిక నియమాలు, నిబంధనలను మెరుగ్గా పాటించడంలో సహాయపడుతుంది. భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశంలో వివిధ స్థానిక నియమాలతో ఐఎస్ఏ స్కాన్, స్వీకరించే సామర్థ్యం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఫ్లిప్ సైడ్ ఐఎస్ఏను తప్పనిసరి చేస్తే వాహనాల ధరలను మరింత పెరిగే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








