Business idea: ఈ బిజినెస్ ఐడియా నిజంగానే మీ జీవితాన్ని మార్చేస్తుంది.. కొత్త వ్యాపారం
ప్రజల అభిప్రాయాల్లో, ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారం చేసే వారి ఆలోచనలు మారుతున్నాయి. ఒకప్పటిలా మూస పద్ధతిలో కాకుండా వైవిధ్యమైన వ్యాపారాలను ప్రారంభిస్తూ భారీగా లాభాలను ఆర్జిస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉచితంగా పబ్లిసిటీ చేసుకుంటూ తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు...
ప్రజల అభిప్రాయాల్లో, ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారం చేసే వారి ఆలోచనలు మారుతున్నాయి. ఒకప్పటిలా మూస పద్ధతిలో కాకుండా వైవిధ్యమైన వ్యాపారాలను ప్రారంభిస్తూ భారీగా లాభాలను ఆర్జిస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉచితంగా పబ్లిసిటీ చేసుకుంటూ తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. అయితే వ్యాపారం అనగానే భారీగా పెట్టుబడి, పెట్టాలనే ఆలోచనతో ఉంటాం. కానీ సరైన అవగాహన, వినూత్నంగా ఆలోచిస్తే తక్కువ బడ్జెట్‌లో కూడా మంచి వ్యాపారాలను ప్రారంభించవచ్చు. అలాంటి ఓ మంచి బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం..
ప్రస్తుతం మార్కెట్లో టమాటో పౌడర్‌కు డిమాండ్ పెరిగింది. టమాటో లేకపోతే ఏ వంట పూర్తికానీ పరిస్థితి. కొన్ని సందర్భాల్లో రూపాయి కిలోకి పడిపోయే టమాటో మరికొన్ని సందర్భాల్లో రూ. 50కి చేరిన సందర్భాలు కూడా చూసే ఉంటాం. ఇలాంటి సమయాల్లో టమాట పౌడర్‌ను ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోంది. అంతే కాకుండా ఈ టమాట పౌడర్‌ను రెస్టరెంట్‌లో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌లో కూడా ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ బిజినెస్‌తో మంచి లాభాలు ఆర్జించవచ్చు.
ఈ బిజినెస్‌ను తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే మొదలు పెట్టొచ్చు. ఆ తర్వాత మీ ఆదాయానికి అనుగుణంగా మీ బిజినెస్‌ను పెంచుకుంటూ పొదొచ్చు. ఇక ఈ బిజినెస్‌ను ప్రారంభించాలంటే..టమాటలతో పాటు ప్యాకింగ్ కవర్స్ అవసరపడతాయి. ఇందుకోసం ముందుగా టమాటలను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి, అనంతరం చిన్నచిన్న ముక్కలుగా చేసుకొని ఎండలో బాగా ఆరబెట్టాలి. టమాటలు ఎండిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. వ్యాపారం ప్రారంభంలో ఇంట్లో ఉపయోగించే మిక్సీని ఉపయోగించిన సరిపోతుంది. పోడి చేసుకున్న తర్వాత పౌడర్‌ను ప్యాకేజ్ చేసుకొని మీ సొంత బ్రాండింగ్‌తో మార్కెటింగ్ చేసుకుంటే సరిపోతుంది.
ఒకవేళ మీ వ్యాపారం వృద్ధి చెందితే ఆ తర్వాత పెద్ద పెద్ద మిషిన్స్‌ను కొనుగోలు చేసి పెద్ద ఎత్తున టమాటో పౌడర్‌ను తయారు చేసుకోవచ్చు. ఇక లాభాల విషయానికొస్తే ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాట పౌడర్ రూ. 140 నుంచి రూ. 160 వరకు ఉంది. ఒకవేళ హోల్‌సేల్‌లో విక్రయించిన కిలో పౌడర్‌ను రూ. 100 విక్రయించుకోవచ్చు. ఈ లెక్కన లాభాలు ఎలా ఉంటాయో మీరే అర్థం చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..