Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valley of Flowers: పువ్వుల ప్రేమికులా.. మన దేశంలో ఈ పువ్వుల లోయలో 500 రకాల పువ్వులు కనువిందు..

ఉత్తరాఖండ్‌లోని చమోలిలో ఉన్న లోయల్లో ఒక లోయను పూల లోయ అని అంటారు. ప్రపంచ వారసత్వ జాబితాలో కూడా చోటు సంపాదించుకున్న ఈ పువ్వుల లోయ ఏడాదిలో 3 నుంచి 4 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. తొలకరి జల్లులు కురిసే సమయంలో పువ్వులు వికసించడం మొదలు పెడతాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు ఇక్కడ ప్రకృతి ప్రేమికుల రద్దీ ఉంటుంది.

Valley of Flowers: పువ్వుల ప్రేమికులా.. మన దేశంలో ఈ పువ్వుల లోయలో 500 రకాల పువ్వులు కనువిందు..
Valley Of Flowers Chamoli District
Follow us
Surya Kala

|

Updated on: Jun 15, 2024 | 4:54 PM

ఉత్తరాఖండ్ అంటే దేవ భూమి మాత్రమే కాదు.. ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. వేసవిలో ఉష్ణోగ్రత నుంచి ఉపశమనం కోసం మాత్రమే కాదు ఎప్పుడైనా లాంగ్ వీకెండ్ వచ్చినా సరే తమ సెలవులను ఎంజాయ్ చేయడానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఉత్తరాఖండ్ కు చేరుకుంటారు. దేశంలో ప్రఖ్యాత పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ది చెందింది. ఏడాది పొడవునా పర్యాటకులు ఇక్కడికి వస్తూనే ఉంటారు. ఇక్కడ ఉన్న పర్వతాలు, పచ్చని అడవులు మాత్రమే కాదు.. కనుల విందు చేసే పూల తోటలు కూడా ఈ ప్రదేశానికి సహజ సౌందర్యాన్ని మరింత ఇనుమడింపజేస్తాయి. ప్రకృతి దగ్గరికి జీవించేలా చేస్తుంది ఈ ప్రదేశం. అందుకంటే ప్రకృతి ప్రేమికులు ఈ దేవ భూమికి చేరుకుంటారు. మనసుకు ఆనందాన్ని ఇచ్చే ప్రకృతి మాత్రమే కాదు కనులు విందు చేసే పువ్వులంటే ఇష్టమైతే ఉత్తరాఖండ్ ను జూన్, జూలై నెలల్లో సందర్శించండి. అందమైన లోయల్లో పచ్చదనంతో పాటు పూల లోయకు కూడా ప్రసిద్ధి చెందింది. పర్వతాల ఒడిలో ఉన్న పువ్వుల లోయ అందం ఎవరినైనా సరే ఆకర్షిస్తుంది. రంగురంగుల పువ్వులతో లోయ ఇంద్రధనస్సుని తలపిస్తుంది.

ఉత్తరాఖండ్‌లోని చమోలిలో ఉన్న లోయల్లో ఒక లోయను పూల లోయ అని అంటారు. ప్రపంచ వారసత్వ జాబితాలో కూడా చోటు సంపాదించుకున్న ఈ పువ్వుల లోయ ఏడాదిలో 3 నుంచి 4 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. తొలకరి జల్లులు కురిసే సమయంలో పువ్వులు వికసించడం మొదలు పెడతాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు ఇక్కడ ప్రకృతి ప్రేమికుల రద్దీ ఉంటుంది.

ఎన్ని రకాల పువ్వులు ఉంటాయంటే

చమోలీలోని ఈ పూల లోయ 87.5 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ప్రతి సంవత్సరం మన దేశం నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో పర్యాటకులు ఈ లోయ అందాలను సందర్శించడానికి వస్తారు. ఈ సీజన్ లో ఈ లోయలో 500 కంటే ఎక్కువ జాతుల పుష్పాలు వికసించి కనుల విందు చేస్తాయి. ఈ పువ్వుల్లో విదేశాలలో వికసించే పువ్వులు కూడా ఉన్నాయి. ఈ పువ్వుల లోయను వృక్షశాస్త్రజ్ఞుడు ఫ్రాంక్ సిడ్నీ స్మిత్ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఫ్రాంక్ సిడ్నీ స్మిత్ పర్వతారోహణ చేస్తున్న సమయంలో అనుకోకుండా ఈ లోయ సమీపంలోకి చేరుకున్నాడు. అప్పుడు విరబూసిన పువ్వుల అందాలను.. స్వర్గం లాంటి ఈ ప్రదేశాన్ని చూసిన తొలిచూపులోనే మైమరచిపోయాడు.

ఇవి కూడా చదవండి

ఈ పూల లోయకు ఎలా చేరుకోవాలంటే

జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు పర్యాటకుల కోసం వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ తెరిచి ఉంటుంది. అయితే ఈ లోయకు వెళ్లాలంటే ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. భారతీయులకు ఈ లోయను సందర్శించడానికి ఫీజు రూ.150 కాగా, విదేశీయులు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఈ అందమైన చమోలి లోయను చేరుకోవాలంటే బద్రీనాథ్ హైవే మీదుగా ప్రయాణించి గోవింద్‌ఘాట్‌కు చేరుకోవాలి. అక్కడ నుంచి పువ్వుల లోయకు చేరుకోవాలంటే దాదాపు 11 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత హేమకుండ్ యాత్ర బేస్ క్యాంప్ మీదుగా ఘఘరియాకు వెళ్లాలి. ఈ బేస్ క్యాంప్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో అందమైన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కనువిందు చేస్తుంది. అయితే ఈ లోయకు వెళ్లాలంటే ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..