AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mango Kalakand: మామిడి పండుతో కలాకండ్.. టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే..

మామిడి పండ్ల కాలం ఎప్పుడు వస్తుందా అని ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. చిన్నా, పెద్దా అందరూ మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడి పండుతో స్వీట్ రెసిపీలు ఏం చేసినా చాలా రుచిగా ఉంటాయి. అందులోనూ కలాకండ్ అంటే చాలా మందికి ఇష్టం. అలాంటి కలాకండ్‌ని మామిడి పండుతో కలిపి చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. టేస్టే నెక్ట్స్ లెవల్ అంతే. ఈ స్వీట్ నోట్లో పెడితే..

Mango Kalakand: మామిడి పండుతో కలాకండ్.. టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే..
Mango Kalakand
Chinni Enni
| Edited By: |

Updated on: Jun 16, 2024 | 10:14 PM

Share

మామిడి పండ్ల కాలం ఎప్పుడు వస్తుందా అని ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. చిన్నా, పెద్దా అందరూ మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడి పండుతో స్వీట్ రెసిపీలు ఏం చేసినా చాలా రుచిగా ఉంటాయి. అందులోనూ కలాకండ్ అంటే చాలా మందికి ఇష్టం. అలాంటి కలాకండ్‌ని మామిడి పండుతో కలిపి చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. టేస్టే నెక్ట్స్ లెవల్ అంతే. ఈ స్వీట్ నోట్లో పెడితే కరిగిపోతుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చు. ఎందుకంటే ఇందులో పంచదార వాడాల్సిన పని లేదు. మామిడి పండు నేచురల్ గానే తియ్యగా ఉంటుంది. మరి ఈ నోరు ఊరించే స్వీట్‌ని ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మ్యాంగో కలాకండ్‌కి కావాల్సిన పదార్థాలు:

మామిడి పండు, పన్నీర్ తురుము, కోవా, తరిగిన డ్రై ఫ్రూట్స్, కండెన్స్‌డ్ మిల్క్, కుంకుమ పువ్వు, పాలు.

మ్యాంగో కలాకండ్‌ తయారీ విధానం:

ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఒక స్పూన్ పాలు, కొద్దిగా కుంకుమ పువ్వు వేసి కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి.. అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. ఇందులో కోవా, తురిమిన పన్నీర్ వేసి చిన్న మంట మీద వేయించాలి. ఇవి వేగాక.. కండెన్స్‌డ్‌ మిల్క్ వేసి కలుపుకోవాలి. అలాగే ఈ సమయంలో కుంకుమ పువ్వును వేసి మరో రెండు నిమిషలు తిప్పుతూ ఉడికించాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా హల్వాలాగా తయారవుతుంది. ఈ సమయంలో స్టవ్ ఆఫ్ చేయాలి. తీసి పెట్టుకున్న మామిడి పండు గుజ్జును.. మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇది కండెన్స్‌డ్ కడాయిలో వేసి బాగా అన్నీ మిక్స్ చేయాలి. చివరిలో డ్రైఫ్రూట్స్ వేసి కలపాలి. ఇప్పుడు మిక్స్ చేసిన మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఒక ప్లేట్‌లోకి తీసి సమానంగా పరిచి కట్ చేసి పక్కన పెట్టాలి. ఇవి బాగా ఆరిపోయాక తీసి స్టోర్ చేసుకోవడమే. అంతే ఎంతో రుచిగా ఉండే మ్యాంగో కలాకండ్ సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి.

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్