- Telugu News Photo Gallery Black Jamun Health Benefits: Black Jamun Has Many Health Benefits Its Control Diabetes To Blood Pressure
Black Jamun: భలేభలే నేరేడు పళ్లు! హార్ట్ ఎటాక్ నుంచి షుగర్ వ్యాధి వరకు అన్నీ పరార్
వేసవి పండ్లలో నేరేడు పండ్లు ఒకటి. ఇవి రుచికి తియ్యగా.. పుల్లగా ఉంటాయి. అందుకే ఇవి చాలా మందికి ఇష్టం. నేరేడు పండ్లు పోషకాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం, హృద్రోగులకు నేరేడు పండ్లు చాలా మేలు చేస్తాయి. గుండె సంబంధిత సమస్యలున్న మధుమేహ రోగులు రక్తదానం చేయకూడదు. ఇది దాతకు శారీరక సమస్యలను కలిగిస్తుంది. నేటి కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది..
Updated on: Jun 16, 2024 | 1:18 PM

వేసవి పండ్లలో నేరేడు పండ్లు ఒకటి. ఇవి రుచికి తియ్యగా.. పుల్లగా ఉంటాయి. అందుకే ఇవి చాలా మందికి ఇష్టం. నేరేడు పండ్లు పోషకాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం, హృద్రోగులకు నేరేడు పండ్లు చాలా మేలు చేస్తాయి.

గుండె సంబంధిత సమస్యలున్న మధుమేహ రోగులు రక్తదానం చేయకూడదు. ఇది దాతకు శారీరక సమస్యలను కలిగిస్తుంది. నేటి కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య 10 కోట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటువంటి షుగర్ వ్యాధిగ్రస్తుల పాలిట నేరేడు పండ్లు దివ్వౌషధం అనే చెప్పాలి.

నేరేడులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడతాయి. నేరేడులో విటమిన్-సి అధిక స్థాయిలో ఉంటుంది. ఫలితంగా ఈ పండును క్రమం తప్పకుండా తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగు పడుతుంది. అలాగే జలుబు, ఫ్లూ వంటి ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. వివిధ చర్మ సమస్యలలో కూడా నేరేడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

దంతాలు, చిగుళ్ళ సమస్యలను నివారించడంలో నేరేడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి చిగుళ్ళను బలోపేతం చేయడానికి, నోటి దుర్వాసనను తొలగించడానికి సహాయపడతాయి.

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో కూడా నేరేడు సహాయపడుతుంది. ఫలితంగా, నేరేడు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. శరీరంలో హానికరమైన కార్బన్-డయాక్సైడ్ స్థాయిని తగ్గించడం ద్వారా శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ చేరుకోవడానికి నేరేడులోని పోషకాలు సహాయపడతాయి. ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.




