Moringa Laddu: రోజుకో ఈ లడ్డూ తింటే.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు!

మునగాకులు, మునక్కాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. మునగాకును ఎలా తీసుకున్నా.. ఆరోగ్యానికి చాలా మంచిది. వీటితో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మునగాకు పొడితో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. మునగాకు పొడితో ఎంతో రుచికరమైన లడ్డూలు కూడా చేయవచ్చు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. రోజుకు ఒక్కటి తిన్నా..

Moringa Laddu: రోజుకో ఈ లడ్డూ తింటే.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు!
Moringa Laddu
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 16, 2024 | 10:14 PM

మునగాకులు, మునక్కాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. మునగాకును ఎలా తీసుకున్నా.. ఆరోగ్యానికి చాలా మంచిది. వీటితో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మునగాకు పొడితో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. మునగాకు పొడితో ఎంతో రుచికరమైన లడ్డూలు కూడా చేయవచ్చు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. రోజుకు ఒక్కటి తిన్నా.. చాలా రకాల సమస్యలను నయం చేసుకోవచ్చు. ఇవి చేయడం కూడా ఎంతో సులభం. మరి ఈ మునగాకుల లడ్డూని ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మునగాకుల లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు:

మునగాకుల పొడి, కొబ్బరి తురుము, నట్స్, ఖర్జూరం, తేనె, యాలకుల పొడి, నెయ్యి.

మునగాకుల లడ్డూ తయారీ విధానం:

ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వేడి చేయాలి. కొద్దిగా నెయ్యి వేసి వేడి చేశాక.. గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకూ వేయించాలి. ఆ తర్వాత తీసి పక్కన పెట్టాలి. ఆ నెక్ట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బ్లెండర్‌లో వేసి మెత్తగా పొడిలా తయారు చేయాలి. ఆ తర్వాత ఇందే బ్లండర్‌లో ఖర్జూరాలను కూడా వేసి పౌడర్ చేయాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో మునగాకుల పొడి.. వేయించిన డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, తేనె వేసి బాగా కలుపుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు రెండు చేతులకు కూడా నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీకు కావాల్సిన సైజులో లడ్డూల్లా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గాలి చొరబడని కంటైనర్‌లో లడ్డూలను ఉంచి స్టోర్ చేసుకోవాలి. వీటని ఫ్రిజ్‌లో ఉంచుకుంటే.. చాలా రోజుల వరకూ నిల్వ ఉంటాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇంకెందుకు లేట్.. మీరు కూడా ఓ సారి ట్రై చేసి రుచి చూడండి. పిల్లలకు ఇస్తే ఎంతో బలం.

Latest Articles