Ragi Malt Drink: ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..

ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో రాగులు కూడా ఒకటి. రాగి పిండితో ఇప్పటికే మనం ఎన్నో రకాల రెసిపీలు తెలుసుకున్నాం. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాం. ఈ రెసిపీ కూడా రుచితో ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. అదే రాగి మాల్ట్ డ్రింక్. చాలా మందికి దీని గురించి తెలిసే ఉంటుంది. రాగులు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రాగులతో ఈజీగా వెయిట్ లాస్..

Ragi Malt Drink: ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
Ragi Malt Drink
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 16, 2024 | 10:40 PM

ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో రాగులు కూడా ఒకటి. రాగి పిండితో ఇప్పటికే మనం ఎన్నో రకాల రెసిపీలు తెలుసుకున్నాం. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాం. ఈ రెసిపీ కూడా రుచితో ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. అదే రాగి మాల్ట్ డ్రింక్. చాలా మందికి దీని గురించి తెలిసే ఉంటుంది. రాగులు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రాగులతో ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ డ్రింక్ తాగవచ్చు. వీటిని తాగడం వల్ల ఎముకలు కూడా చాలా బలంగా తయారవుతాయి. మరి ఈ రాగి మాల్ట్ డ్రింక్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రాగి మాల్ట్ డ్రింక్‌కి కావాల్సిన పదార్థాలు:

రాగి పిండి, బెల్లం, పాలు, యాలకుల పొడి, బాదం.

రాగి మాల్ట్ డ్రింక్‌ తయారీ విధానం:

ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో మంచి నీళ్లు పెట్టి మరగనివ్వండి. ఈ నీళ్లు బాగా మరిగాక ఇందులో రాగి పిండి కలపాలి. ఉండలుగా అవ్వగుండా కలుపుకోండి. ఈ రాగి పిండి బాగా ఉడికి.. గట్టి పడిన తర్వాత బెల్లం తురిమి వేయండి. బెల్లం కూడా కరిగాక.. పాలు వేసి మిక్స్ చేయండి. చివరగా యాలకుల పొడి వేసి కలపాలి. అంతే ఎంతో రుచిగా ఉండే రాగి మాల్ట్ డ్రింక్ సిద్ధం. ఇక సర్వింగ్ బౌల్స్ తీసుకుని వాటిపై బాదం పప్పు సర్వ్ చేసుకుని తాగడమే. ఇది ఎవరైనా తాగవచ్చు.

ఇవి కూడా చదవండి

చిన్న పిల్లలకు బేబీ ఫుడ్‌లా కూడా ఇవ్వొచ్చు. ఈ డ్రింక్ చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒక సారి ట్రై చేయండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఈ డ్రింక్ డయాబెటీస్ ఉన్న వాళ్లు కూడా తాగవచ్చు. బ్రేక్ ఫాస్ట్‌లా కూడా తీసుకోవచ్చు. ఉదయం ఈ ఒక్క డ్రింక్ తాగితే సరిపోతుంది. వెయిట్ లాస్  అవ్అవాలి నుకునే వాళ్లు ఇలా ట్రై చేయవచ్చు.

Latest Articles