AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Risk: ఆల్కహాల్‌ అతిగా తాగడం వల్ల కాలేయం దెబ్బతినడమే కాదు.. మరో 200వ్యాధులకు దారి తీస్తుంది..!

ఈరోజుల్లో పార్టీల్లో మద్యం తాగే ట్రెండ్ బాగా పెరిగిపోయి, పెగ్గులు ఎక్కువగా తీసుకోవటం అలవాటుగా మారింది. అయితే ఈ పెగ్ మీ ఆరోగ్యానికి చాలా హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆల్కహాల్‌ అధిక వినియోగం మీ ఆరోగ్యంపై కొన్ని తీవ్రమైన వ్యాధులను కలిగిస్తుంది. ఫలితంగా ప్రాణల మీదకు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Health Risk: ఆల్కహాల్‌ అతిగా తాగడం వల్ల కాలేయం దెబ్బతినడమే కాదు.. మరో 200వ్యాధులకు దారి తీస్తుంది..!
Health Risk
Jyothi Gadda
|

Updated on: Jun 16, 2024 | 5:38 PM

Share

కొందరు సరదాగా గడపడానికి ఆల్కహాల్ తీసుకుంటే, మరికొందరు తమ బాధలను మర్చిపోవడానికి మద్యం తీసుకుంటారు. కానీ ఈ ఆల్కహాల్ మన శరీరానికి స్లో పాయిజన్‌గా పనిచేస్తుంది. ఇది మనకు అనేక వ్యాధులను కలిగిస్తుంది. ఆల్కహాల్‌ అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం, గుండెపై కూడా ప్రభావం చూపుతుంది. అంతేకాదు ఆల్కహాల్‌ అధిక వినియోగం మరెన్నో వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

మద్యం సేవించడం వల్ల ఎలాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందో ఇక్కడ తెలుసుకుందాం..

లివర్ డ్యామేజ్:

ఇవి కూడా చదవండి

ఆల్కహాల్ నేరుగా మన కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఒక వ్యక్తి రోజూ ఆల్కహాల్ తాగితే, అది అతని కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. శరీరం ఆల్కహాల్‌ను టాక్సిన్‌గా తీసుకుంటుంది. ఇది కాలేయ కణాలను నాశనం చేస్తుంది. సిర్రోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులను కూడా కలిగిస్తుంది. ఇది మరింత క్యాన్సర్ రూపాన్ని తీసుకుంటుంది. అంతే కాదు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు కూడా వస్తాయి.

గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది:

అవును, ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. అతిగా ఆల్కహాల్ సేవించే వ్యక్తి తన గుండెకు రక్తాన్ని పంప్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొంటాడని, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని, చాలా సందర్భాలలో గుండెపోటు మరణానికి కూడా దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది:

అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం మన నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది, ఇది మెదడు సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది, మాట్లాడే, ఆలోచించే, గుర్తుంచుకోవడంలో శరీరంలో ప్రకంపనలు సంభవించవచ్చు, సమతుల్యత క్షీణించవచ్చు. డిప్రెషన్, మెదడు దెబ్బతినడం వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం కూడా ఉంది.

రక్తహీనత:

ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారి శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. ఐరన్ లోపం వల్ల మీరు రక్తహీనతకు గురవుతారు. శరీరంలో రక్తం తక్కువగా ఉండటం వల్ల బలహీనత, తల తిరగడం, అపస్మారక స్థితి వంటి సమస్యలు ఏర్పడే పరిస్థితికి దారి తీస్తుంది.

క్యాన్సర్:

ఆల్కహాల్ కూడా క్యాన్సర్‌తో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. అవును, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వ్యక్తులు నోటిలో, గొంతులో, వాయిస్ బాక్స్, ఫుడ్ పైప్‌లో క్యాన్సర్ బారిన పడతారు. ఇది కాకుండా, కాలేయం, బ్రెస్ట్ క్యాన్సర్, పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..