How Long Should Ceiling Fan: ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌ని నిరంతరాయంగా తిరుగుతోందా..? అయితే, ఇది తెలుసుకోండి..!
కూలర్, ఏసీతో పోలిస్తే ఇది ఆర్థికంగా తక్కువ ధర ఉండటమే కాకుండా తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. అయితే ఇళ్లలో ఏసీలు, కూలర్లు ఉన్నవారు కూడా ఫ్యాన్లు వాడుతున్నారు. అన్ని కాలాల్లోనూ ఈ ఫ్యాన్లు పగలు, రాత్రి పరుగులు తీస్తాయి. ఇలాంటప్పుడు వేడి ఎక్కువై ఫ్యాన్‌కు మంటలు అంటుకునే ప్రమాదం ఉందనే విషయం మీకు తెలుసా..?
వేసవి కాలంలో ఇళ్లలో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు ఎక్కువగా వినియోగిస్తారు. భారతదేశంలోని చాలా ఇళ్లలో ఎక్కువగా ఉపయోగించేది ఫ్యాన్. కూలర్, ఏసీతో పోలిస్తే ఇది ఆర్థికంగా తక్కువ ధర ఉండటమే కాకుండా తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. అయితే ఇళ్లలో ఏసీలు, కూలర్లు ఉన్నవారు కూడా ఫ్యాన్లు వాడుతున్నారు. అన్ని కాలాల్లోనూ ఈ ఫ్యాన్లు పగలు, రాత్రి పరుగులు తీస్తాయి. ఇలాంటప్పుడు వేడి ఎక్కువై ఫ్యాన్‌కు మంటలు అంటుకునే ప్రమాదం ఉందనే విషయం మీకు తెలుసా..? ఎందుకంటే, ఎక్కువసేపు ఫ్యాన్ నిరంతరాయంగా ఉపయోగించడం వల్ల దాని మోటార్ వేడెక్కుతుంది కాబట్టి షార్ట్ సర్క్యూట్, మోటార్ కాలిపోయి మంటలు రావటం వంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఫ్యాన్‌ని ఎన్ని గంటలు నిరంతరంగా వాడొచ్చు. ?
మీరు ఫ్యాన్‌ని ఎంతసేపు ఉపయోగించవచ్చు?
సీలింగ్ ఫ్యాన్లు గంటల తరబడి నడిచేలా డిజైన్ చేశారు. అయితే, మధ్యమధ్యలో విశ్రాంతి ఇవ్వడం ప్రయోజనకరం. ఫ్యాన్ ఎక్కువగా నడపడం వల్ల వేడెక్కుతంది. అయితే, సీలింగ్ ఫ్యాన్‌ను ఎక్కువసేపు ఉపయోగించేందుకు, దాని సామర్థ్యాన్ని మరింత మెరుగ్గా నిర్వహించడానికి మీరు ఎప్పటికప్పుడు బ్లేడ్‌లను శుభ్రం చేయాలి. ఫ్యాన్ బ్యాలెన్స్‌గా ఉండేలా చూసుకోండి. అంతే కాకుండా ఫ్యాన్ నుంచి ఏదైనా శబ్దం వస్తే వెంటనే ఎలక్ట్రీషియన్‌ను సంప్రదించండి.
అలాగే, ఫ్యాన్‌ని ఎక్కువగా వాడకూడదని గుర్తుంచుకోండి. రాత్రింబవళ్లు ఫ్యాన్‌ని నిరంతరాయంగా ఉపయోగించడం వల్ల అది త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అవసరం లేనప్పుడు ఫ్యాన్‌కు కాస్త విశ్రాంతిని ఇవ్వండి. దీంతో ఫ్యాన్ సక్రమంగా పనిచేయడమే కాకుండా విద్యుత్ ఆదా అవుతుంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..