AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spicy Food: స్పైసీ ఫుడ్ తింటే షెడ్డుకెళ్తారు జాగ్రత్త.. ఈ లక్షణాలను అస్సలు విస్మరించకండి..

చాలామంది ఇష్టమైన ఆహారం తినాలని కోరుకుంటారు.. కొందరు మామూలు ఆహారం తింటే.. మరికొందరు స్పెషల్ గా స్పైసీగా తినేందుకు ఇష్టపడుతుంటారు.. ముఖ్యంగా బయట లభించే స్పైసీ ఫుడ్ ను ఇష్టంగా తింటుంటారు.. అయితే.. స్పైసీ రుచి కొన్ని సార్లు ఆరోగ్యానికి విషంలా మారుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు..

Spicy Food: స్పైసీ ఫుడ్ తింటే షెడ్డుకెళ్తారు జాగ్రత్త.. ఈ లక్షణాలను అస్సలు విస్మరించకండి..
Spicy Food
Shaik Madar Saheb
|

Updated on: Jun 16, 2024 | 12:24 PM

Share

చాలామంది ఇష్టమైన ఆహారం తినాలని కోరుకుంటారు.. కొందరు మామూలు ఆహారం తింటే.. మరికొందరు స్పెషల్ గా స్పైసీగా తినేందుకు ఇష్టపడుతుంటారు.. ముఖ్యంగా బయట లభించే స్పైసీ ఫుడ్ ను ఇష్టంగా తింటుంటారు.. అయితే.. స్పైసీ రుచి కొన్ని సార్లు ఆరోగ్యానికి విషంలా మారుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. ఒకవేళ చాలా కారంగా ఉండే ఆహారాన్ని తినాలనుకుంటే, ఇక్కడ పేర్కొన్న సమస్యలు.. సంకేతాలను విస్మరించడం తప్పు అని హెచ్చరిస్తున్నారు..

వాస్తవానికి భారతీయ ఆహారంలో మసాలా దినుసులకు ప్రత్యేక స్థానం ఉంది. కానీ ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.. మీరు దీనిని లైట్ గా తీసుకున్నా.. కొన్ని స్పైసీ ఫుడ్ ను విషంలా నిషేధం విధించిన సందర్భాలున్నాయి.. ఇది వింతగా అనిపించవచ్చు.. కానీ నిజం. జనాదరణ పొందిన కొరియన్ నూడుల్స్‌ను నిషేధించాల్సి వచ్చింది. డానిష్ కంపెనీ సమ్యాంగ్ తయారు చేసిన నూడుల్స్ ను ప్రాణాంతకమంటూ నిషేధం విధించారు.

నిజానికి, మిరపకాయలో ఉండే క్యాప్సైసిన్ అనే మూలకం మనకు కారంగా అనిపించేలా చేస్తుంది. ఈ మూలకం పరిమాణం ఎంత ఎక్కువగా ఉంటే, మిరపకాయ అంత కారంగా ఉంటుంది. అదే సమయంలో, ఈ క్యాప్సైసిన్ శరీరానికి హానిని కూడా కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఎక్కువ కారంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే శరీరంలో కనిపించే ఈ లక్షణాలను విస్మరించవద్దు.. ఈ నిర్లక్ష్యం ఒక్కోసారి ప్రాణం కూడా తీస్తుంది..

స్పైసీ ఫుడ్ తినడం వల్ల కనిపించే ఈ లక్షణాలను విస్మరించవద్దు..

శ్వాస ఆడకపోవుట, తీవ్ర జ్వరం, అపస్మారక స్థితి, మూర్ఛ.. లాంటివి కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది..

కారంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు

మీరు చాలా కారంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే, క్యాప్సైసిన్ జీర్ణవ్యవస్థను చికాకుపెడుతుంది. ఇది కడుపు చికాకు, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తుంది. సాధారణంగా ఈ సమస్యలు కొంత సమయం తర్వాత నయమవుతాయి.. కానీ కొన్ని సందర్భాల్లో అవి తీవ్రమైన రూపాన్ని కూడా తీసుకుంటాయి.

ఈ వ్యక్తులు చాలా స్పైసీ ఫుడ్ తినకూడదు..

చాలా కారంగా ఉండే ఆహారాన్ని పిల్లలకు, వృద్ధులకు ఇవ్వకూడదు.. అంతేకాకుండా ఇప్పటికే కడుపు సమస్యలు ఉన్నవారికి ముఖ్యంగా ప్రమాదకరం. అదనంగా, క్యాప్సైసిన్‌కు అత్యంత సున్నితంగా ఉండే వ్యక్తులు కూడా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఎటువంటి హాని లేకుండా మసాలా ఆహారాన్ని ఆస్వాదించండి..

  • మీరు హాయిగా తినగలిగేంత స్పైసీ ఫుడ్ మాత్రమే తినండి.
  • కారంగా ఉండే ఆహారంతో పెరుగు లేదా పాలు తీసుకోండి. క్యాప్సైసిన్ కొవ్వులో కరిగేది, కాబట్టి పాలు లేదా పెరుగు దాని ప్రభావాన్ని తగ్గిస్తుంది.
  • మీ కడుపులో మంటగా ఉంటే, చల్లటి నీటిని తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
  • స్పైసీ ఫుడ్.. ఆరోగ్యానికి హానికరమైనది .. కావున మీ పరిమితులను గుర్తుంచుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..