Chicken Liver: చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా.. అయితే, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి..!

చికెన్‌ వంటకాలు ఎన్నో రకాలు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తయారు చేస్తారు. ప్రతి పద్ధతి అద్భుతమైన రుచిని ఇస్తుంది. అయితే, చికెన్ కంటే కూడా చికెన్ లివర్ తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Chicken Liver: చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా.. అయితే, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి..!
Chicken Liver
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 14, 2024 | 9:50 PM

మీరు మాంసాహారులైతే ఖచ్చితంగా చికెన్‌ను ఇష్టపడతారు. సహజంగానే ఇది రుచితో పాటు ఆరోగ్యకరమైనది కూడా. ఇతర మాంసంతో పోలిస్తే జీర్ణం కావడానికి తేలికగా ఉంటుంది. ఇది ప్రోటీన్‌కు మంచి మూలం. చికెన్‌ వంటకాలు ఎన్నో రకాలు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తయారు చేస్తారు. ప్రతి పద్ధతి అద్భుతమైన రుచిని ఇస్తుంది. అయితే, చికెన్ కంటే కూడా చికెన్ లివర్ తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

నాన్ వెజ్ ఐటమ్స్ అనగానే నోట్లో నీళ్లు తిరుగుతాయ్‌ కొంతమందికి. మ్యుఖ్యంగా చికెన్ లవర్స్ ఎక్కువగా ఉంటారు. కొంతమంది చికెన్ లివర్‌ను మరింత ఇష్టంగా తింటుంటారు. ఇది ఆరోగ్యానికి కూడా చాల మంచిది. ఎందుకంటే, చికెన్ లివర్ లో విటమిన్ ఎ, బి, ప్రోటీన్లు , మినరల్స్, ఐరన్, విటమిన్ బి 12, ఫొలేట్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో సెలీనియం మంచి మొత్తంలో ఉంటుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

చికెన్‌ లివర్‌తో కంటి, చర్మ, రక్త హీనత సమస్యలను దూరం చేస్తుంది. చికెన్‌ లివర్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే ఐరన్, విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. ఇది తినడం ద్వారా రక్త కణాలను పెంచుతుంది. రక్త హీనత తగ్గించడానికి సహాయపడుతుంది. చికెన్‌ లివర్ లో విటమిన్ K అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మ్యుఖ్యం. మీ డైట్‌లో చికెన్‌ లివర్ తీసుకుంటే బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాదు గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

చికెన్‌ లివర్ విటమిన్ B12 ఆరోగ్యకరమైన నాడి వ్యవస్థకు తోడ్పడుతుంది. జ్ఞాపకశక్తి, నిరాశ, అయోమయం, చిరాకు వంటి మానసిక సమస్యలు ఉన్నవారికి ఇంది మంచి ఆహారం. చికెన్ లివర్ డయాబెటిస్ పేషెంట్లకు కూడా మంచిది. దీన్ని తినడం వల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి చూపుకు మంచిది. అంతేకాదు.. ఇందులో ఉండే సెలీనియం గుండె జబ్టులపై పోరాడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను కూడా కంట్రోల్‌ చేస్తుంది. లివర్ లో ఉండే ఫోలేట్ లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ముఖ్యంగా కండరాలు, ఎముకలను బలంగా చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..