Tirumala: ఒక్కరోజులోనే తిరుమల టూర్.. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ..
అందులోనూ ముందుగానే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి, దర్శనం టికెట్, రూమ్ ఇలా అన్ని ఒక రెండు నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా అప్పటికప్పుడు డిసైడ్ అయి తిరుమల వెళ్లాలంటే ఎలా.? ఇలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ఒక మంచి అదిరిపోయే టూర్ ప్యాకేజీని అందిస్తోంది. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే ముగియడం..

తిరుమల శ్రీవారిని ఎన్నసార్లు దర్శించుకున్నా మళ్లీ మరోసారి వెళ్లాలని చాలా మంది భావిస్తుంటారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కనులారా దర్శించుకొని తరించాలని పరితపిస్తుంటారు. అయితే తిరుమల టూర్ వేయాలంటే ఎంతో ప్లానింగ్‌తో కూడుకుంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రదేశాల నుంచి తిరుమల వెళ్లాలంటే. కచ్చితంగా ఒక మూడు నుంచి నాలుగు రోజుల ప్లాన్ అవుతుంది.
అందులోనూ ముందుగానే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి, దర్శనం టికెట్, రూమ్ ఇలా అన్ని ఒక రెండు నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా అప్పటికప్పుడు డిసైడ్ అయి తిరుమల వెళ్లాలంటే ఎలా.? ఇలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ఒక మంచి అదిరిపోయే టూర్ ప్యాకేజీని అందిస్తోంది. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే ముగియడం ఈ ట్రిప్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. తిరుమల శీఘ్రదర్శనం ఫ్రమ్ హైదరాబాద్ బై ఫ్లైట్ పేరుతో ఈ టూరిజం ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఇంతకి ఈ టూర్ ఎలా సాగుతుందంటే..
* ఉదయం 6.55 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఉదయం 9.30 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం హోటల్‌కు వెళ్లి ఫ్రెషప్ అవుతారు.
* ఆ తర్వాత తిరుపతి నుంచి కారులో తిరుమలకు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకల్లా శ్రీవారి దర్శనం పూర్తి అవుతుంది.
* మధ్యాహ్నం 2 గంటలకు తిరుమలలో లంచ్ ఉంటుంది. లంచ్ పూర్తికాగానే తిరుపతిలోని పద్మావతి ఆలయానికి వెళ్తారు. అక్కడ 3.30 గంటలలోపు దర్శనం పూర్తి చేసుకొని తిరిగి 5.30 గంటల వరకు ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు.
* ఇక సాయంత్రం 6.35 గంటలకు తిరుపతి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రి 7.45 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధర వివరాలు..
ఇక ప్యాకేజీ ధరల విషయానికొస్తే.. ఒక్కొక్కరికీ రూ.12,499గా నిర్ణయించారు. ఇందులో ఫ్లైట్ జర్నీ, హోటల్, టికెట్ దర్శనం, తిరుమలపైకి కార్లు వంటివి కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 నెంబర్ ను సంప్రదించవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..




