Tamarind Seeds :చింతగింజలతో చర్మ సౌందర్యం..! ఇలా వాడితే మెరిసే అందం మీ సొంతం..

చింత గింజల పౌడర్‌ చర్మానికి మంచి హైడ్రేషన్‌ ను అందిస్తుంది. ఈ గింజల్లో హైల్‌రోనిక్‌ యాసిడ్‌ నిండి ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. చింతపండు ఫేస్ మాస్క్ టైరోసోనేస్ ఎంజైమ్‌ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇలా చేయడం వల్ల డార్క్ స్పాట్స్ క్రమంగా తగ్గుతాయి.

Tamarind Seeds :చింతగింజలతో చర్మ సౌందర్యం..! ఇలా వాడితే మెరిసే అందం మీ సొంతం..
Tamarind Seeds
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 14, 2024 | 8:34 PM

Tamarind Seeds : ప్రస్తుతం చాలా మంది చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా డార్క్ స్పాట్స్ ముఖ సౌందర్యాన్ని పూర్తిగా పాడుచేస్తుంది. దీంతో వారు మానసికంగా కూడా కుంగుబాటుకు గురవుతున్నారు. డార్క్ పిగ్మెంట్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల చర్మంపై డార్క్ స్పాట్స్ ఏర్పడతాయి. డార్క్ స్పాట్స్ సమస్యతో బాధపడేవారు మార్కెట్ లో లభించే మందులను వాడకూడదు. మీకు ఇంట్లోనే పరిష్కారం దొరుకుతుంది. ఈ నల్ల మచ్చలను చింతపండు గింజలతో సులభంగా తొలగించవచ్చు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

చింతపండును రోజూ వంటల్లో వాడితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. చింతపండు అందాన్ని పెంచేందుకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే, చింతపండు గింజలను ఉపయోగించడం వల్ల నల్ల మచ్చలను తొలగించవచ్చు. ఇందుకోసం చింతపండు గింజలను ఎండబెట్టి రుబ్బుకోవాలి. దీన్ని తేనెతో కలిపి నల్లటి మచ్చలపై అప్లై చేయాలి. చింత గింజల పౌడర్‌ చర్మానికి మంచి హైడ్రేషన్‌ ను అందిస్తుంది. ఈ గింజల్లో హైల్‌రోనిక్‌ యాసిడ్‌ నిండి ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. చింతపండు ఫేస్ మాస్క్ టైరోసోనేస్ ఎంజైమ్‌ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇలా చేయడం వల్ల డార్క్ స్పాట్స్ క్రమంగా తగ్గుతాయి.

చింతపండును ఉపయోగించడం వల్ల చర్మ కణాలలో మంట కూడా తగ్గుతుంది. ఈ చింత గింజల్లో చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది మిమ్మల్ని యవ్వనంగా ఉండచంలో సహాయపడుతుంది. చింత గింజలను ఉపయోగించి ఫేస్‌ మాస్క్‌ తయారు చేసుకోవచ్చు. దీనికోసం చింత గింజల పొడి, బొప్పాయి రసం కలిపి ముఖానికి రాసుకోవాలి. అదేవిధంగా పొడి చర్మం ఉన్నవారు పాలతో.. జిడ్డు చర్మం ఉన్నవారు ముల్తానీ మట్టి లేదా శనగ పిండితో చింత గింజల పొడిని కలిపి రాసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఈ చింతగింజలను ఎండలో ఆరబెట్టి.. పొడిచేసి.. వీటిలో ఆలివ్‌ నూనెను వేసి కలిపి చర్మంపై పూస్తే.. మీ చర్మ రంగు మరింత పెరుగుతుంది. ఈ గింజలు మీకు సహజ మెరుపుతోపాటు వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. మొటిమలను వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది. అన్ని రకాల స్కిన్‌ ఇన్ఫెక్షన్‌ సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?