ఓర్నీ తెలివి చల్లగుండ.. పాత టీవీని ఎలా మార్చాడో తెలిస్తే బిత్తరపోతారు
ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 1 లక్షకు పైగా లైక్‌లు వచ్చాయి. అలాగే ఈ వీడియోకి ఇప్పటివరకు 3.3 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు. ఈ వీడియో
జుగాద్ విషయంలో మన దేశం అగ్రస్థానంలో ఉంది. మన దేశ ప్రజలు ఎలాంటి సమస్యనైనా సరే క్షణాల్లో పరిష్కారించేస్తారు. ఇలాంటి జుగాఢ్‌లకు సంబంధించి ప్రతిరోజూ మనం సోషల్ మీడియాలో అనేక వీడియోలను చూస్తాము. కొన్నిసార్లు ప్రజలు ఇటుక, సిమెంట్ ఉపయోగించి గోడలో శాశ్వత కూలర్‌లను తయారు చేయడం చూశాం. అలాగే, సోషల్ మీడియాలో నీటిని స్ప్రే చేసే ఫ్యాన్ కూడా హవా చూపించింది. అయితే, ఈ సారి కనిపించిన జుగాఢ్ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
ఈ వీడియోలో ఒక వ్యక్తి పాత టీవీని ఉపయోగించి జుగాఢ్ చేశాడు. పాడైపోయిన టీవితో కూలర్ తయారు చేశాడు. వైరల్ క్లిప్‌లో టీవీలో స్క్రీన్ స్థానంలో ఫ్యాన్ ఇన్‌స్టాల్ చేశాడు. అంతేకాకుండా, దాని చుట్టూ కూలింగ్ ప్యాడ్‌లు, లోపల మోటారును ఏర్పాటు చేశాడు. మీరు టీవీని ఆన్, ఆఫ్ చేయడానికి ఎగువన స్విచ్ కూడా ఏర్పాటు చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 1 లక్షకు పైగా లైక్‌లు వచ్చాయి. అలాగే ఈ వీడియోకి ఇప్పటివరకు 3.3 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు. ఈ వీడియో Instagram హ్యాండిల్ @altu.faltuలో షేర్ చేయబడింది.
ఇది కూలర్ కాదు టెలికూలర్ అంటున్నారు నెటిజన్లు. ఈ బొమ్మకు ఏ పేరు పెట్టాలి? అని అడుగుతున్నారు సోషల్ మీడియా జనాలు. నా ఇంట్లో రెండు టీవీలు ఉన్నాయి. వాటిని ఎలాగైనా కొత్త విధానంలోకి మార్చేయాలంటూ మరికొందరు స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..