Viral News: సిమ్మెంట్, ఇటుకలను ఇష్టంగా తినేస్తున్న మహిళ.. వింత ఆహారపు అలవాటు చూసి భర్త షాక్..
ఇంటి గోడలను చూస్తే చాలు.. వాటిని తినాలని కోరుకుంటుంది. గోడలను, సిమెంటు తినే అలవాటున్న మహిళ గురించి ఇప్పుడు ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆమె ఎప్పుడూ గోడలను ప్లాస్టర్‌ను పగలగొడుతుంది.. దానిలోని పదార్థాలను నమలడానికి ప్రయత్నిస్తుంది. అంతే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆమెకు తన ఆహారపు అలవాటు మంచిది కాదని తెలుసు.. అయినా సరే ఆ అలవాటుని వదులుకోవడం లేదు.
ఆహారం విషయంలో ప్రతి ఒక్కరికీ వారి సొంత ఎంపిక, ఇష్టా అయిష్టాలు ఉంటాయి. కొందరికి స్వీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం, మరికొందరు స్పైసీ లేదా కారం వంటకాలను ఇష్టపడతారు. అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్న మహిళకు ఇష్టమైన ఆహారం అందరికంటే భిన్నమైనది. ఎందుకంటే ఆమెకు ఇటుక, సిమెంట్ తినడమంటే చాలా ఇష్టం. సహజంగానే ఇది చదివిన తర్వాత ఎవరైనా సరే ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే ఇది ముమ్మాటికి నిజం. ఇంటి గోడలను చూస్తే చాలు.. వాటిని తినాలని కోరుకుంటుంది. గోడలను, సిమెంటు తినే అలవాటున్న మహిళ గురించి ఇప్పుడు ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆమె ఎప్పుడూ గోడలను ప్లాస్టర్‌ను పగలగొడుతుంది.. దానిలోని పదార్థాలను నమలడానికి ప్రయత్నిస్తుంది. అంతే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆమెకు తన ఆహారపు అలవాటు మంచిది కాదని తెలుసు.. అయినా సరే ఆ అలవాటుని వదులుకోవడం లేదు.
బ్రిటన్‌కు చెందిన 39 ఏళ్ల ప్యాట్రిస్ బెంజమిన్ రామ్‌గూలమ్‌కు మొరంగ్ కు సిమెంట్, ఇటుకలను తింటుంది. ఇలా తినడం తన ఆరోగ్యానికి మంచిది కాదని ఆమెకు బాగా తెలుసు. అయినప్పటికీ.. ఆమె సిమ్మెంట్ తినకుండా ఉండ లేకపోతుంది. సిమెంట్ తిన్నాక కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పడం కష్టమని ఆ మహిళ చెబుతోంది.
ఈ వింత వ్యసనం ఎలా అలవాటు అయిందంటే
తనకు 15 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. గోడలకు ఉన్న ప్లాస్టర్‌ను తొలగించి దాని వెనుక ఏమి ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించానని ప్యాట్రిస్ బెంజమిన్ చెప్పింది. ఈ సమయంలో సిమెంట్ ను నోట్లో పెట్టుకుని రుచి చూసింది. దీని రుచి బాగా నచ్చడంతో మళ్లీ మళ్లీ తినడం మొదలుపెట్టింది. అలా సిమెంట్ తినడానికి ఎప్పుడు అలవాటు పడ్డానో తనకే తెలియదని చెప్పింది. సిమ్మెంట్ పొడిగా, రుచిగా ఉందని.. తాను తినకుండా ఉండలేకపోతున్నానని చెప్పింది.
సిమెంట్ తింటున్న భార్యను చూసి షాక్ తిన్న భర్త
తన స్కూల్ ఫ్రెండ్‌ని ప్రేమ పెళ్లి చేసుకున్నానని ప్యాట్రిస్ బెంజమిన్ చెప్పింది. అయితే పెళ్లి అయ్యాక కూడా తన వింత ఆహారపు అలవాటు గురించి తెలియకుండా దాచినట్లు వెల్లడించింది. అయితే, ఓ రోజు అనుకోకుండా ఆమె గోడపై నుంచి సిమెంట్ తీసి తింటుండగా భర్త చూశాడు. అయితే గత 25 ఏళ్లుగా ఇలా తింటుందని తెలుసుకున్న భర్త షాక్‌కు గురయ్యాడు. దీంతో భర్త రామ్‌లుగాంను పలుమార్లు ఆహారపు అలవాటుని వదులుకొమ్మని బతిమాలాడు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆమె అంగీకరించలేదు.
ఈ వ్యాధితో బాధపడుతున్న ప్యాట్రిస్ బెంజమిన్
అప్పుడు ప్యాట్రిస్ బెంజమిన్ ను ఆమె డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్ళాడు. ఆమె పికా అనే వ్యాధితో బాధపడుతుందని తేలింది. ఈ వ్యాధి బారిన పడినవారు తినకూడనవి కూడా తినడం ప్రారంభిస్తారని వైద్యులు చెప్పారు. అయితే వైద్యుల సలహా తర్వాత కూడా రాములుగం సిమెంటు, ఇటుకలు తినే అలవాటును వదులుకోలేదు. ఇవి తినడం వలన తనకు సంతోషం, శాంతి లభిస్తుంది కనుక ఈ అలవాటుని మనలేకపోతున్నట్లు వెల్లడించింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..