Viral Video: పాములా కుబుసం విడుస్తూ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న జీవి.. నెట్టింట్లో షాకింగ్ వీడియో వైరల్

విషపు జీవుల్లో పాము, తేలుతో పాటు జెర్రి కూడా ఒకటి. ఈ జీవిని సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే పరిసర ప్రాంతాల్లో చూసే ఉంటారు. కాళ్ల జెర్రి కరిస్తే సామాన్యంగా ప్రాణహాని ఉండదు.. అయితే విపరీతమైన నొప్పితో ఇబ్బంది పడతారు. కొంతమందికి ఎలర్జీ వస్తుంది. జెర్రి నేల మీద పాకుతుంది. చీకటి, తేమ అంటే ఇష్టమైన ఈ జీవి కొన్ని సార్లు నెల మీద నిద్రించే వ్యక్తులకు ప్రమాదం కలిగిస్తుంది.

Viral Video: పాములా కుబుసం విడుస్తూ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న జీవి.. నెట్టింట్లో షాకింగ్ వీడియో వైరల్
Scolopendra Shoking Video
Follow us

|

Updated on: Jun 14, 2024 | 6:22 PM

ప్రకృతిలో రకరకాల జీవులు ఉన్నాయి. ఈ ప్రపంచంలో కొన్ని రకాల జీవులు గురించి మనకు తెలుసు.. అదే సమయంలో ప్రకృతిలోని అనేక రకాల జీవుల గురించి మనకు ఏమీ తెలియదు. మనం రోజూ చూసే జీవులు.. జీవులు కూడా చాలా ఉన్నప్పటికీ.. వాటి గురించి మనకు తెలిసింది కూడా కొంచెం మాత్రమే.. అలాంటి జీవో ఒకటి ప్రస్తుతం ప్రజల్లో చర్చనీయాంశమైంది. పాములా చర్మం కుబుసంలా విడుస్తోంది.. అదే సమయంలో ఊసరవెల్లిలా రంగు మార్చుకుంటుంది. ఈ వింత జీవికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఇది చూసిన జనాలు అమితంగా ఆశ్చర్యపోతున్నారు.

విషపు జీవుల్లో పాము, తేలుతో పాటు జెర్రి కూడా ఒకటి. ఈ జీవిని సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే పరిసర ప్రాంతాల్లో చూసే ఉంటారు. కాళ్ల జెర్రి కరిస్తే సామాన్యంగా ప్రాణహాని ఉండదు.. అయితే విపరీతమైన నొప్పితో ఇబ్బంది పడతారు. కొంతమందికి ఎలర్జీ వస్తుంది. జెర్రి నేల మీద పాకుతుంది. చీకటి, తేమ అంటే ఇష్టమైన ఈ జీవి కొన్ని సార్లు నెల మీద నిద్రించే వ్యక్తులకు ప్రమాదం కలిగిస్తుంది. చెవుల్లోకి ప్రవేశించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ జెర్రి గోధుమ రంగులో లేదా నలుపు రంగులో రకరకల రంగుల్లో ఉంటుంది.. అయితే జెర్రి ఎప్పుడైనా తన స్కిన్ ని విడుస్తుందని.. అప్పుడు ఊసరవెల్లిలా తన రంగుని తానే మార్చుకుంటుందని మీకు తెలుసా.. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇలాంటి జెర్రి ఒకటి కనిపిస్తోంది.

ఇక్కడ వీడియో చూడండి

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలోని జెర్రి లక్షణాలు ఎవరినైనా సరే ఆశ్చర్యపరుస్తాయి. వీడియోలో సాధారణ జెర్రి కనిపిస్తోంది. ఇది మొదట గోధుమ రంగులో ఉంది.. తరువాత నెమ్మదిగా తన చర్మాన్ని తాను తొలగించుకుంటూ ఉంది.. ఈ ప్రక్రియ పాము ఎలా కుబుసం విడుస్తుందో అదే విధంగా ఉంది. ఈ చర్య జరుగుతున్న సమయంలో జెర్రి.. వీడియో క్లిప్ చివరిలో జెర్రి తన రంగును పూర్తిగా మార్చుకుంది.

ఈ వీడియో యూట్యూబ్‌లో Luv Exotics అనే ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటికే వేల మంది దీనిని చూశారు. రకరకాల కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒకరు తన జీవితంలో మొదటిసారిగా ఈ రకమైన జెర్రిని చూశానని పేర్కొన్నాడు.’ మరొకరు చూస్తుంటే ఇది పాము కంటే ప్రమాదకరమైనదిగా కనిపిస్తుందని పేర్కొన్నాడు. మనుషులం కూడా దీనిలా చేయగలిగితే బాగుంటుంది.’ అని, ఇలా రకరకాల కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
ఏరా.! మీరు మారరా.? ఇతడు ఏం చేశాడో తెలిస్తే
ఏరా.! మీరు మారరా.? ఇతడు ఏం చేశాడో తెలిస్తే
ఇంకా స్పేస్‌లోనే సునీతా విలియమ్స్ తిరిగొచ్చేదెప్పుడు.?
ఇంకా స్పేస్‌లోనే సునీతా విలియమ్స్ తిరిగొచ్చేదెప్పుడు.?
దారుణం.. మిస్టర్ తెలంగాణ సోహైల్ మృతి. బైక్‌పై వెళ్తూ..
దారుణం.. మిస్టర్ తెలంగాణ సోహైల్ మృతి. బైక్‌పై వెళ్తూ..
EPFO కీలక అప్‌డేట్‌.. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారికి ఆఫర్.
EPFO కీలక అప్‌డేట్‌.. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారికి ఆఫర్.
3.5 ఎకరాల్లో ఒక్కటే మర్రి చెట్టు.. శతాబ్దాల చెట్టుకు పునరుజ్జీవం.
3.5 ఎకరాల్లో ఒక్కటే మర్రి చెట్టు.. శతాబ్దాల చెట్టుకు పునరుజ్జీవం.
అండమాన్‌లో తెలుగు వారిపై లాఠీ చార్జ్.. పలువురికి గాయాలు.
అండమాన్‌లో తెలుగు వారిపై లాఠీ చార్జ్.. పలువురికి గాయాలు.
ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా ఇవి తీసుకుంటే అలసట దూరం., మీ గుండె పదిలం.!
ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా ఇవి తీసుకుంటే అలసట దూరం., మీ గుండె పదిలం.!
భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి
భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి
ప్రేమ పేరుతో వేధింపులు యువతి ఆత్మహత్య.! ఫొటోస్ పెడతానంటూ..
ప్రేమ పేరుతో వేధింపులు యువతి ఆత్మహత్య.! ఫొటోస్ పెడతానంటూ..