Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga in Evening: సాయంత్రం యోగా చేయడం కూడా బెస్ట్.. ఏ యోగాసనాలు వేయాలంటే

యోగా గురించి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి యోగా ఉదయం మాత్రమే చేయాలి.. సాయంత్రం వేళల్లో యోగా చేయడం వల్ల ప్రయోజనం ఉండదని ఎక్కువ మంది నమ్ముతారు. అయితే ఉదయం మాత్రమే కాదు సాయంత్రం యోగా చేయడం కూడా ఆరోగ్య పరంగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం వేళల్లో యోగా చేయడం వల్ల శరీరానికి ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసుకుందాం..

Yoga in Evening: సాయంత్రం యోగా చేయడం కూడా బెస్ట్.. ఏ యోగాసనాలు వేయాలంటే
Yoga In Evening
Follow us
Surya Kala

|

Updated on: Jun 14, 2024 | 3:47 PM

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ఆహారంతో పాటు శారీరక వ్యాయామం కూడా అవసరం. నిపుణులు తరచుగా ఉదయాన్నే నిద్రలేచి యోగా-వ్యాయామం చేయాలని సలహా ఇస్తుంటారు. ఉదయం శారీరక శ్రమ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే సాయంత్రం యోగా లేదా వ్యాయామం చేయవద్దని దీని అర్థం కాదు. యోగా గురించి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి యోగా ఉదయం మాత్రమే చేయాలి.. సాయంత్రం వేళల్లో యోగా చేయడం వల్ల ప్రయోజనం ఉండదని ఎక్కువ మంది నమ్ముతారు. అయితే ఉదయం మాత్రమే కాదు సాయంత్రం యోగా చేయడం కూడా ఆరోగ్య పరంగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం వేళల్లో యోగా చేయడం వల్ల శరీరానికి ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసుకుందాం..

సాయంత్రం యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఒత్తిడి తగ్గుతుంది: సాయంత్రం యోగా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. అలసటను దూరం చేయడంలో యోగా చాలా మేలు చేస్తుంది. సాయంత్రం యోగా చేస్తే రాత్రికి మంచి నిద్ర వస్తుంది.

శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది: సాయంత్రం యోగా చేసే అలవాటు శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. రోజంతా ఏదో ఒక దాని గురించి ఆందోళన చెందుతూ ఉంటే.. మనస్సు ప్రతికూలంగా ఆలోచిస్తుంటే సాయంత్రం యోగా చేయండి.

ఇవి కూడా చదవండి

హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి: సాయంత్రం వేళల్లో యోగా చేయడం వల్ల ఒత్తిడి, భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

సాయంత్రం సమయంలో ఏ యోగాసనాలు వేయాలంటే

పశ్చిమోత్తనాసనం: ఎక్కువగా కూర్చొనే ఉద్యోగం చేస్తున్నట్లయితే పశ్చిమోత్తనాసనం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ యోగాసనం వేయడం వలన శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఆసనం చేయడం వల్ల అధిక రక్తపోటు, షుగర్ అదుపులో ఉంటాయి.

ఉత్తానాసనం: ఈ ఆసనం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచించే వారికి ఉత్తనాసనం బెస్ట్ ఆసనం.

చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే..

సాయంత్రం యోగా చేసేటప్పుడు కడుపు ఖాళీగా ఉండాలి. ఎక్కువ మొత్తంలో స్నాక్స్ తింటే అప్పుడు యోగా చేయకండి. ఇలా చేయడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..