AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair fall solution: జుట్టు రాలిపోతోందా..? పట్టులాంటి కురులు కావాలంటే.. ఈ ఒక్క ఆయిల్‌ను ఇలా వాడితే సరి..!

అంతే కాకుండా, రోజ్‌మేరీ ఆయిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ అలర్జీ లక్షణాలు మీ జుట్టు, స్కాల్ప్‌ను సురక్షితంగా ఉంచుతాయి. రోజ్మేరీ ఆయల్‌ వినియోగంతో మీ జుట్టు బలంగా మారుతుంది. రోజ్‌మేరీ ఆయిల్‌ కలిపి తలకు పట్టించి, 15 నిమిషాల తర్వాత షాంపూ రాసుకుని తలస్నానం చేయాలి. మీకు నెరిసిన జుట్టు ఉంటే, రోజ్‌మేరీ ఆయిల్‌తో కొంచెం

Hair fall solution: జుట్టు రాలిపోతోందా..? పట్టులాంటి కురులు కావాలంటే.. ఈ ఒక్క ఆయిల్‌ను ఇలా వాడితే సరి..!
Rosemary Oil
Jyothi Gadda
|

Updated on: Jun 14, 2024 | 4:08 PM

Share

పొడవాటి ఆరోగ్యకరమైన, అందమైన జుట్టు ఉండాలని అందరూ కోరుకుంటారు. ఆడవారికి ఇలాంటి జుట్టు అంటే చాలా ఇష్టపడుతుంటారు. నల్లగా మెరిసే అందమైన జుట్టు కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా మంది మహిళలు దీని కోసం ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయినా, ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో నిరాశకు లోనవుతుంటారు. కానీ, కేశ సౌందర్యం కోసం రోజ్మేరీ ఆయిల్ బెస్ట్‌ అప్షన్‌ అని మీకు తెలుసా..? జుట్టును సహజంగా ఆరోగ్యంగా ఉంచడంలో రోజ్మేరీ ఆయిల్ కీలక పాత్ర పోషిస్తుంది. రోజ్‌మేరీ ఆయిల్‌లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టుకు శక్తినిస్తుంది. జుట్టు సమస్యలను నయం చేస్తుంది.

ఈ నూనె స్కాల్ప్ నుండి చుండ్రును తొలగించడానికి, జుట్టును బలోపేతం చేయడానికి, నల్లగా మార్చడానికి, జుట్టు రాలడాన్ని నిరోధించడానికి, జుట్టును ఒత్తుగా, ఆరోగ్యంగా మార్చడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా, రోజ్‌మేరీ ఆయిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ అలర్జీ లక్షణాలు మీ జుట్టు, స్కాల్ప్‌ను సురక్షితంగా ఉంచుతాయి. రోజ్మేరీ ఆయల్‌ వినియోగంతో మీ జుట్టు బలంగా మారుతుంది.

జుట్టు రాలడం నుంచి బయటపడేందుకు కొబ్బరినూనె, రోజ్‌మేరీ ఆయిల్‌ కలిపి తలకు పట్టించి, 15 నిమిషాల తర్వాత షాంపూ రాసుకుని తలస్నానం చేయాలి. మీకు నెరిసిన జుట్టు ఉంటే, రోజ్‌మేరీ ఆయిల్‌తో కొంచెం బాదం నూనెను కలిపి మీ తలపై మసాజ్ చేయండి. ఈ రెండు నూనెలు జుట్టు కొల్లాజెన్‌ను పెంచుతాయి. జుట్టు రంగును మెరుగుపరుస్తాయి. తెల్ల జుట్టు వెంటనే నల్లగా మారుతుంది. అదేవిధంగా రోజ్‌మేరీ ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల చుండ్రు, దురద నుంచి బయటపడవచ్చు.

ఇవి కూడా చదవండి

3 చెంచాల రోజ్‌మేరీ ఆయిల్‌కు 3 చెంచాల హెన్నా పౌడర్‌ను మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు మెరుపు పెరుగుతుంది. ఈ ప్యాక్‌ అప్లై చేసిన తర్వాత సుమారు 30 నిమిషాల తర్వాత షాంపూ రాసుకుని తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలే సమస్యలను దూరం చేసి మీ జుట్టు నిగనిగలాడేలా చేస్తుంది.

రోజ్‌మేరీ ఎసెన్షియల్ ఆయిల్‌ని మీ స్కాల్ప్‌కి మసాజ్ చేస్తే మీ డల్ హెయిర్‌ని మెరిసేలా చేస్తుంది. ఇది మీ ట్రెస్‌లను మృదువుగా, సులభంగా విడదీస్తుంది. రోజ్మేరీ ఆయిల్ జుట్టును పునరుజ్జీవింపజేయడంలో సహాయపడుతుంది. రోజ్మేరీ ఆయిల్ మీ జుట్టుకు అవసరమైన తేమను అందిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..