Watch: రీల్ మోజుతో రిస్క్ చేశాడు.. ఒక్క తొక్కుడుతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.. విషాదాంతం
మరోవైపు ఈ సంఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగు సంచారం గురించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ఆ గ్రామానికి చేరుకున్నారు. ఏనుగును తిరిగి అడవిలోకి పంపించేశారు. కాగా, ఏనుగు దాడి నుంచి తప్పించుకునేందుకు ముర్సాలీన్, రీల్ రికార్డు చేసే వ్యక్తి, ఇతరులు పరుగు తీసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఏనుగుతో రీల్ చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి కోరి చావును కొనితెచ్చుకున్నట్టయింది. అతడు ఆ ఏనుగు భయపెట్టి దానిని తరిమేందుకు యత్నించాడు. కానీ, అది అడవి ఏనుగు.. ఆగ్రహంతో ఊగిపోయింది. రెచ్చిపోయిన గజరాజు.. ఘీకారం చేస్తూ.. అతని వెంటపడింది. తొండంతో విసిరి నేలకేసి కొట్టింది. అంతటితో ఆగలేదు ఆ ఏనుగు.. అతన్ని తన కాలుతో తొక్కి చంపేసింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే..
అడవి నుంచి బయటపడిన ఒక ఏనుగు ఆ జిల్లాలోని పలు గ్రామాల్లో సంచరించింది. గురువారం ఉదయం హబీబావాలా గ్రామంలోకి ప్రవేశించింది. దీంతో ఏనుగును చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఈ క్రమంలోనే బాగ్దాద్ అన్సార్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల ముర్సాలీన్ ఆ ఏనుగుతో రీల్ చేసేందుకు ప్రయత్నించాడు. ఏనుగును భయపెట్టి తరిమేందుకు దాని సమీపానికి వెళ్లాడు. ఆగ్రహించిన ఏనుగు అతడి వెంటపడింది. దీంతో ఆ వ్యక్తితోపాటు అక్కడున్న జనం భయంతో పరుగులు తీశారు. అయితే ముర్సాలీన్‌ను సమీపించిన ఏనుగు కాళ్లతో అతడ్ని తొక్కింది. తొండంతో 25 అడుగుల ఎత్తుకు విసిరికొట్టింది. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
बिजनौर – रील बना रहे युवक को जंगली हाथी ने पटक कर मार डाला, हाथी हाईडिल कॉलोनी मे कई दिनों से मचा रहा उत्पात, शांत खड़े हाथी को भगाने गया था युवक, रील का वीडियो सोशल मीडिया पर वायरल , क्रोधित हाथी ने युवक को उतारा मौत के घाट, अफजलगढ़ क्षेत्र के हबीब वाला गांव की घटना.#Bijnor |… pic.twitter.com/BNaS5paXI1
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) June 13, 2024
మరోవైపు ఈ సంఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగు సంచారం గురించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ఆ గ్రామానికి చేరుకున్నారు. ఏనుగును తిరిగి అడవిలోకి పంపించేశారు. కాగా, ఏనుగు దాడి నుంచి తప్పించుకునేందుకు ముర్సాలీన్, రీల్ రికార్డు చేసే వ్యక్తి, ఇతరులు పరుగు తీసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..