AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch : నడిరోడ్డుపై ఈతకొడుతున్నారు.. ఆర్థిక రాజధానిలో ఇదీ పరిస్థితి..!

అతని ఈత సరదాను చూసి జనాలు నవ్వుకుంటున్నారు. ఈ వీడియో పూణేలోని రైల్వే స్టేషన్ సమీపంలో కనిపించింది. బహుశా ఈ వ్యక్తి రీల్ చేయడానికి ఈ వీడియోను చిత్రీకరించాడు అనే మాటలు వినిపించాయి.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Watch : నడిరోడ్డుపై ఈతకొడుతున్నారు.. ఆర్థిక రాజధానిలో ఇదీ పరిస్థితి..!
Man Swimming In Rain Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 13, 2024 | 9:22 PM

కొన్ని రోజులుగా పూణెలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు పూణెలో వర్షం కురిసిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు ఆలోచింపజేసేవిగా ఉంటే, మరి కొన్ని వీడియోలు ఫన్నీగా ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఒక యువకుడు వీధిలో వర్షపు నీటిలో ఈత కొడుతూ ఆనందిస్తున్నాడు. వీడియో చూసిన తర్వాత మీరు కూడా తల పట్టుకుంటారు. విశేషమేమిటంటే.. ఆయన ఇలా ఈత కొడుతుండడం చూసి వీధిలో జనం ఆశ్చర్యంతో నిలబడిపోయి చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.

పుణెలో ఏదైనా జరగొచ్చు అంటూ సోషల్ మీడియాలో చాలా వీడియోలు వస్తున్నాయి.. అయితే ఈ వీడియో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఈ వైరల్ వీడియోలో మీరు భారీ వర్షం కురుస్తున్నట్లు చూస్తారు. రహదారి వరదలతో నిండిపోయింది. వర్షం కారణంగా ప్రజలు రోడ్లపై ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. అయితే ఓ యువకుడు మాత్రం నవ్వు ఆపుకోలేని పని చేస్తూ కనిపిస్తున్నాడు. ఈ వీడియోలో ఓ యువకుడు నడిరోడ్డుపై వర్షపు నీటిలో ఈత కొట్టడం చూసి స్థానికులు, వాహనదారులు అవాక్కయ్యారు. అతని ఈత సరదాను చూసి జనాలు నవ్వుకుంటున్నారు. ఈ వీడియో పూణేలోని రైల్వే స్టేషన్ సమీపంలో కనిపించింది. బహుశా ఈ వ్యక్తి రీల్ చేయడానికి ఈ వీడియోను చిత్రీకరించాడు అనే మాటలు వినిపించాయి.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో X ఖాతా @purrankumawat76 నుండి షేర్‌ చేశారు. ఈ వీడియో క్యాప్షన్‌లో ఇది “పూణే రైల్వే స్టేషన్” సమీపంలో ఇలాంటి అద్భుత దృశ్యం కనిపించదని రాసి ఉంది. చాలా మంది వినియోగదారులు వీడియోకు ప్రతిస్పందించారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షించారు.