Watch: అయ్య బాబోయ్‌ రెండు తలల పాము.. ఒకేసారి పలుమార్లు కాటు వేసింది.. పరిస్థితి ఎలా ఉందంటే..!

మీరు ఎప్పుడైనా రెండు తలల పామును చూశారా..? చూడకపోతే ఈ వీడియో చూడండి. అయితే ఈ క్లిప్ జనాలను షాక్ కి గురి చేసింది. వైరల్‌ వీడియోలో ఒక వ్యక్తి రెండు తలల పాముతో వీడియో తీస్తుండగా, అరుదైన పాము అతనిపై అనేక మార్లు దాడి చేసింది. ఈ వీడియోను ఇప్పటివరకు 9.6 లక్షలకు పైగా వీక్షించారు.

Watch: అయ్య బాబోయ్‌ రెండు తలల పాము.. ఒకేసారి పలుమార్లు కాటు వేసింది.. పరిస్థితి ఎలా ఉందంటే..!
Rare Two Headed Snake
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 13, 2024 | 6:46 PM

మీరు ఎప్పుడైనా రెండు తలల పామును చూశారా..? చూడకపోతే ఈ వీడియో చూడండి. అయితే ఈ క్లిప్ జనాలను షాక్ కి గురి చేసింది. వైరల్‌ వీడియోలో ఒక వ్యక్తి రెండు తలల పాముతో వీడియో తీస్తుండగా, అరుదైన పాము అతనిపై అనేక మార్లు దాడి చేసింది. ఈ వీడియోను ఇప్పటివరకు 9.6 లక్షలకు పైగా వీక్షించారు.

మీరు ఇప్పటికి రెండు తలల పాముల గురించి వినే ఉంటారు. అయితే ఒక మొండెం, రెండు తలలతో ఉన్న పాము జూ కీపర్‌పై దాడి చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జూ నిర్వాహకుడు జే బ్రూవర్ తాజాగా రెండు తలల పాము అరుదైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో పాము రెండు తలలు కలిగి ఉంది. రెండు నోర్లతో అది అతనిపై దాడి చేయడం కనిపిస్తుంది. జే తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ‘జైప్రీహిస్టోరిక్‌పేట్స్’తో ఈ వీడియోను పంచుకున్నారు. దాని క్యాప్షన్‌లో, “రెండు తలల పాము నన్ను కాటేసింది. కోపంతో ఉన్న ఒక పాముతోనే ప్రమాదం అనుకుంటే..ఇప్పుడు నాపై ఒకేసారి రెండు పాములు దాడి చేసినట్టైందని రాశారు.

ఇవి కూడా చదవండి

జేకి జూ నిర్వహిస్తున్నాడు. అందులో అతను అనేక రకాల పాములు, మొసళ్లను పెంచుతున్నాడు. అతను ఈ పాములకు సంబంధించిన అనేక మనోహరమైన వీడియోలను తన అనుచరులతో పంచుకుంటూ ఉంటాడు. ఈ వీడియోను ఇప్పటివరకు 9.6 లక్షల కంటే ఎక్కువసార్లు వీక్షించారు. రెండు తలలు కలిగి ఉన్న పాములు ఎలా దాడి చేస్తాయో తెలుసుకోవాలని కామెంట్‌లలోని వ్యక్తులు ఆసక్తిగా అడుగుతున్నారు.

ఒక వినియోగదారు స్పందిస్తూ..ఆ పాము దేహాన్ని ఏ తల నియంత్రిస్తుందంటూ ఆశ్చర్యంగా అడుగుతున్నారు. మరొకరు, ఈ సారి మాకు మూడు తలల సొరచేపను చూపించండి అంటూ అడుగుతున్నారు. మరో వినియోగదారు ఇలా వ్యాఖ్యానించారు,..రెండు తలల పాము నిజంగా అద్భుతంగా ఉంది. ఈ అందమైన పాము మీకు ఎక్కడ దొరికింది? ఇది విషపూరితం కాదా?అని అడుగుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..