AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ కూరగాయ అకాల మరణం నుండి కాపాడుతుంది..! అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడి..

మూడు దశాబ్దాలకు పైగా నార్వేజియన్ ప్రజల పెద్ద బృందంపై ఈ పరిశోదన నిర్వహించబడింది. పరిశోధకులు 77,297 మంది పెద్దలపై డేటాను సేకరించారు. వారికి మూడు ఆరోగ్య పరీక్షలు చేయించారు. వారు తినే బంగాళాదుంపల మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి వారు ఆహారం తీసుకోవడం గురించిన సమాచారాన్ని సేకరించారు.

ఈ కూరగాయ అకాల మరణం నుండి కాపాడుతుంది..! అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడి..
Potato For Heart
Jyothi Gadda
|

Updated on: Jun 13, 2024 | 7:14 PM

Share

బంగాళాదుంప ప్రసిద్ధ కూరగాయలలో ఒకటి. చాలా మంది బంగాళదుంపలతో అనేక రకాల ప్రయోగాలు చేస్తారు. చాలా మంది దీనిని ఆకు కూరలు, ఇతర కూరగాయలతో కలిపి వండుకుని తింటుంటారు. మరికొందరు నాన్ వెజ్‌తో కూడా వండి తినడానికి ఇష్టపడతారు. కానీ కాలక్రమేణా బంగాళాదుంప సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక ఖ్యాతిని సృష్టించింది. బంగాళదుంపలో కార్బోహైడ్రేట్లు, స్టార్చ్ పుష్కలంగా ఉంటాయి. అలాంటి బంగాళదుంపల గురించి తరచుగా చెప్పే ఒక విషయం ఏమిటంటే ఆలూని అతిగా తింటే, రక్తంలో చక్కెర పెరగడంతో పాటు బరువు కూడా పెరుగుతారని చెబుతారు. బంగాళదుంపల వల్ల అధిక కార్బోహైడ్రేట్, ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని కూడా అంటుంటారు. కానీ ఇటీవల ప్రచురించిన నివేదిక ప్రకారం ఎక్కువ బంగాళాదుంపలు తినడం వల్ల మరణాలు తగ్గుతాయని సూచించింది.

జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, బంగాళదుంపలు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అదే సమయంలో, మరణాల ప్రమాదం కూడా తగ్గుతుంది.  బంగాళదుంపతో గుండెకు ఆరోగ్యం. ఇందులో అధికమొత్తంలో ఉండే ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా నియంత్రిస్తుంది. బంగాళదుంపను సరైన పద్దతిలో తీసుకుంటే హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గిపోతుంది. బంగాళదుంపలో పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బీ6 ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బంగాళదుంప లో బరువు పెరగడానికి కొన్ని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సన్నగా ఉన్నవాళ్లు దీనిని తీసుకోవడం వల్ల బరువు పెరగవచ్చు.

పరిశోధనకు నాయకత్వం వహించిన ఎరిక్ క్రిస్టోఫర్ ఆర్నెసన్, అతని బృందంతో పాటు బంగాళాదుంపలను వారానికి 14 లేదా అంతకంటే ఎక్కువ తినే వ్యక్తులు – తక్కువ బంగాళాదుంపలు తినే వారి కంటే కొంచెం తక్కువ ప్రమాదం ఉందని కనుగొన్నారు. అధిక బంగాళాదుంపల వినియోగం గుండె జబ్బులు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండెపోటుతో మరణించే ప్రమాదాన్ని కూడా కొద్దిగా తగ్గించిందని పరిశోధకులు కనుగొన్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..