AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Capsicum Egg Fried Rice: టేస్టీ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్.. రుచి సూపర్ అంతే!

ఎగ్ ఫ్రైడ్ రైస్ పేరు చెబితేనే అందరి నోట్లో నీళ్లు ఊరుతాయి. అంత రుచిగా ఉంటుంది. ఇంట్లో చేసినా.. బయట చేసినా ఎప్పుడైనా సరే ఎవరికైనా ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలి అనిపిస్తుంది. ఆ స్మెల్ వస్తేనే ఎప్పుడు తింటామా అనిపిస్తుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టం. ఇష్ట పడి తింటూ ఉంటారు. ఎప్పుడైనా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు చాలా మంది ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తూ..

Capsicum Egg Fried Rice: టేస్టీ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్.. రుచి సూపర్ అంతే!
Capsicum Egg Fried Rice
Chinni Enni
|

Updated on: Jun 13, 2024 | 6:58 PM

Share

ఎగ్ ఫ్రైడ్ రైస్ పేరు చెబితేనే అందరి నోట్లో నీళ్లు ఊరుతాయి. అంత రుచిగా ఉంటుంది. ఇంట్లో చేసినా.. బయట చేసినా ఎప్పుడైనా సరే ఎవరికైనా ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలి అనిపిస్తుంది. ఆ స్మెల్ వస్తేనే ఎప్పుడు తింటామా అనిపిస్తుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టం. ఇష్ట పడి తింటూ ఉంటారు. ఎప్పుడైనా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు చాలా మంది ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉంటారు. ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా.. ఈసారి క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయండి. రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం. లంచ్ బాక్స్, డిన్నర్, బ్రేక్‌ ఫాస్ట్‌లో కూడా ఈ రెసిపీ తినవచ్చు. ఈ ఫ్రైడ్ రైస్ చేయడం కూడా సులభమే. మరి ఈ టేస్టీ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు:

క్యాప్సికమ్, ఎగ్స్, రైస్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, మిరియాల పొడి, ఉప్పు, సోయాసాస్, ఆయిల్.

క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్‌ తయారీ విధానం:

ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి.. అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కగానే.. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించండి. ఇవి ఓ ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాక.. క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి ఇందులో గుడ్లను చితక్కొట్టి తీసుకోండి. వీటిల్లో కొన్ని క్యాప్సికమ్ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడిని కూడా వేసి చల్లుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఉల్లిపాయల మిశ్రమంలో వేసి బాగా ఫ్రై చేయాలి. నెక్ట్స్ సోయాసాస్, అన్నం వేసి మొత్తం బాటా టాస్ చేయాలి. మీకు వీలైతే పెద్ద మంటమీద చేయండి. స్మోకీ ఫ్లేవర్‌తో చాలా రుచిగా ఉంటుంది. మాడిపోతుంది అన్నవాళ్లు.. చిన్న మంటపై కూడా చేసుకోవచ్చు. అంతే ఎంతో రుచిగా ఉండే క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు. చాలా తక్కువ ఐటెమ్స్‌తో ఈ వంట సిద్ధమవుతుంది.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!