Rahu Dosham: పితృ, రాహు దోషాల నివారణకు ఈ రెమిడిస్ పాటించండి.. జీవితంలో సమస్యలు తొలగుతాయి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దానధర్మాలు చేయడం ద్వారా జీవితంలో ఎటువంటి కష్టాలున్నా, దోషాలున్నా తొలగిపోతాయి. జాతకంలో గ్రహాల స్థితిని సరిదిద్దడానికి, అవసరమైన వారికి అన్నదానం, వస్త్రదానం, జీవన ఏర్పాట్లు చేయడం మంచి పరిష్కారం. దీనితో పాటు జంతువులకు, పక్షులకు ఆహారం, నీరు అందించడం కూడా చాలా పుణ్యంగా పరిగణించబడుతుంది. అయితే ఎవరి జాతకంలోనైనా రాహు దోషం లేదా పిత్ర దోషం ఉంటే కొన్ని పరిహారాలు చేయడం వలన ప్రయోజనకరంగా ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాలకు విశిష్ట స్థానం ఉంది. ప్రతి గ్రహానికి దాని సొంత ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాల స్థానం వ్యక్తి జాతకంపై, జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాలు వ్యతిరేక దిశలో కదులుతున్న సమయంలో ప్రజలు దానం మొదలైన అనేక చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దానధర్మాలు చేయడం ద్వారా జీవితంలో ఎటువంటి కష్టాలున్నా, దోషాలున్నా తొలగిపోతాయి. జాతకంలో గ్రహాల స్థితిని సరిదిద్దడానికి, అవసరమైన వారికి అన్నదానం, వస్త్రదానం, జీవన ఏర్పాట్లు చేయడం మంచి పరిష్కారం. దీనితో పాటు జంతువులకు, పక్షులకు ఆహారం, నీరు అందించడం కూడా చాలా పుణ్యంగా పరిగణించబడుతుంది. అయితే ఎవరి జాతకంలోనైనా రాహు దోషం లేదా పిత్ర దోషం ఉంటే కొన్ని పరిహారాలు చేయడం వలన ప్రయోజనకరంగా ఉంటుంది.
రాహు దోషం నుంచి బయటపడటానికి సులభమైన మార్గం
జ్యేష్ఠ మాసంలో ఎండ, వానల కలయిక.. ఈ సీజన్ లో పక్షులకు గింజలు, నీటిని అందించండి. ఇలా చేయడం వల్ల ఆత్మ సంతృప్తి కలగడమే కాదు జాతకంలో రాహు, శని గ్రహాల వల్ల ఏర్పడిన దోషాలు తొలగిపోతాయి. పక్షులు ఆహారాన్ని తీసుకోవడం వలన కష్టాలన్నీ తొలగిపోతాయి. జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగి మరోవైపు పుణ్యం పెరుగుతుందని నమ్మకం.
పితృ దోష నివారణకు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పితృ పక్షంలో పక్షులకు ధాన్యాన్ని ఆహారంగా అందించడం వలన పూర్వీకులు సంతోషిస్తారు. అంతేకాదు జాతకంలో రాహు దోషం కూడా తగ్గుతుంది. పక్షులకు ఆహారం ఇవ్వడం ద్వారా.. జీవితంలోని ప్రతి సంక్షోభం నుంచి ఉపశమనం పొందుతారు. పురోగతిని పొందుతారు. ధాన్యాన్ని అందిచడం వలన సరైన నిర్ణయాలు తీసుకోగల మానసిక బలాన్ని పొందుతాడు. దీనితో పాటు ఉద్యోగం, వ్యాపారంలో లాభదాయక మార్గాలు తెరవబడతాయి.. సంపద పెరుగుతుంది. అప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కోరిన కోరిక నెరవేరుతుంది
పక్షులకు నీరు అందించడం చాలా సులభమైన పని. దీని కోసం ఎత్తైన ప్రదేశంలో ఒక మట్టి గిన్నె లేదా కుండలో నీటిని నింపండి. ఈ మట్టి కుండతో పాటు ఆహారంగా ధాన్యాన్ని ఉంచండి. ధాన్యం లేకపోతే కొన్ని ముడి బియ్యాన్ని జోడించవచ్చు. ఇంటికి పక్షులు రాకపోతే గింజలు, నీరు అందిచందం మొదలు పెట్టండి. కొద్ది రోజుల్లోనే పక్షులు ఇంటి వద్దకు రావడం ప్రారంభిస్తాయి. పక్షి ఆహారం, త్రాగునీరు సేకరించడం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. కోర్టు కేసుల విషయంలో అడ్డంకులు తొలగిపోతాయి. పిల్లల జీవితంలో అడ్డంకులు తొలగిపోయి సుఖ సంతోషాలు నెలకొంటాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు